నాలుగోసారి.. | Sakshi
Sakshi News home page

నాలుగోసారి..

Published Thu, Nov 2 2023 4:50 AM

- - Sakshi

నల్ల నేలలో

గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి : సింగరేణి, కేటీపీపీలతో పరిశ్రమల ఖిల్లాగా పేరున్న భూపాలపల్లి నియోజకవర్గంలో నాలుగోసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు నియోజకవర్గాల్లోని పలు మండలాల కలయికతో ఏర్పడిన ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ రెండుసార్లు తన సత్తా చాటగా ఒకసారి బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసింది. గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వారు ఉపాధి నిమిత్తం ఇక్కడ నివసిస్తుండగా పట్టణ, యువత ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.

ఆరు మండలాలతో ఏర్పాటు..

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఆరు మండలాలతో కూడిన భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పడింది. పరకాల నియోజకవర్గంలోని చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గంలోని గణపురం, రద్దయిన శాయంపేట నియోజకవర్గంలోని శాయంపేట మండలంతో ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అలాగే, పరకాల నియోజకవర్గంలో మెజార్టీ భాగం ఉండి, శాయంపేట నియోజకవర్గంలో ఏడు గ్రామాలు మాత్రమే ఉన్న రేగొండ మండలాన్ని కూడా భూపాలపల్లి సెగ్మెంట్‌లో కలిపారు. కాగా, చిట్యాల మండలం నుంచి టేకుమట్ల, ఇటీవల రేగొండను విభజించి కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటు చేయగా ప్రస్తుతం 8 మండలాలతో భూపాలపల్లి నియోజకవర్గం విస్తరించి ఉంది.

రెండుసార్లు కాంగ్రెస్‌కే..

ఇప్పటి వరకు మూడుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు దఫాలు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. ఈయన 2009లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించగా చీఫ్‌విప్‌ పదవి వరించింది. 2018లో హస్తం గుర్తు నుంచి గెలుపొందిన అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి గెలుపొంది తెలంగాణ రాష్ట్రానికి తొలి శాసన సభాపతిగా పని చేశారు.

పెరుగుతున్న ఓటర్లు..

సింగరేణి, కేటీపీపీ పరిశ్రమల కారణంగా వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వేలాది మంది ఇక్కడి వచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. నియోజకవర్గ కేంద్రం దినదినాభివృద్ధి చెంది జిల్లాగా రూపుదిద్దుకోవడంతో ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2009లో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2,22,552 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 2,68,028 మంది ఉన్నారు. గడిచిన 14 ఏళ్లలో 45,476 మంది ఓటర్లు పెరిగారు.

భూపాలపల్లే కీలకం..

నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో అత్యధికంగా భూపాలపల్లి మండలంలో 75,015 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ప్రధానంగా పట్టణ ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంటుంది. పట్టణంలో 5,600 మంది సింగరేణి ఉద్యోగులు ఉండగా, వారి కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 20వేల ఓట్ల వరకు ఉంటాయి. అలాగే, నియోజకవర్గ మొత్తం 1,26,887 మంది యువ ఓటర్లు ఉన్నారు. పట్టణ, యువ ఓటర్లే ఈ ఎన్నికల్లో కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2009లో ఏర్పడిన భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం

మూడు సెగ్మెంట్ల మండలాలతో ఆవిర్భావం

రెండుసార్లు కాంగ్రెస్‌, ఒకసారి బీఆర్‌ఎస్‌ విజయం

ఇక్కడ యువత, పట్టణ ఓట్లే కీలకం

1/6

2/6

3/6

గండ్ర వెంకటరమణారెడ్డి
ఎస్‌. మధుసూదనాచారి
4/6

గండ్ర వెంకటరమణారెడ్డి ఎస్‌. మధుసూదనాచారి

5/6

6/6

Advertisement
Advertisement