హోర్డింగ్‌ కనిపించలేదా.. కోడ్‌ వర్తించదా..? | Sakshi
Sakshi News home page

హోర్డింగ్‌ కనిపించలేదా.. కోడ్‌ వర్తించదా..?

Published Sat, Nov 11 2023 1:36 AM

కాజీపేటలో తొలగించని హోర్డింగ్‌  - Sakshi

వరంగల్‌ అర్బన్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై నెల రోజులు గడిచింది. అంతటా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. కోడ్‌ వెలువడిన 48 గంటల్లో నగరమంతా జల్లెడ పట్టి రాజకీయ పార్టీలకు చెందిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, గోడపై రాతలు, పోస్టర్లు పార్టీ జెండాలు తొలగించినట్లు బల్దియా ఉన్నతధికారులు ప్రకటించారు. కానీ, కాజీపేట 61వ డివిజన్‌లోని ఫాతిమా కాంప్లెక్స్‌ ఎదురుగా సిద్ధార్థ నగర్‌లోని ఒక మాల్‌పై సీఎం కేసీఆర్‌ చిత్రంతో కూడిన భరోసా పథకానికి చెందిన హోర్డింగ్‌ బల్దియా అధికారులు, సిబ్బందికి కనిపించకపోవడం గమనార్హం. దీంతో ప్రధాన రహదారిపై అంతఎత్తులో ఉన్న హోర్డింగ్‌ తొలగించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

Advertisement

తప్పక చదవండి

Advertisement