టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడులు | Sakshi
Sakshi News home page

టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడులు

Published Sun, Nov 12 2023 1:14 AM

- - Sakshi

అక్రమ మద్యం పట్టివేత కట్కూర్‌లో రూ.82 వేలు, కోలుకొండలో రూ.9 వేల విలువైన సరుకు స్వాధీనం

బచ్చన్నపేట : మండలంలోని కట్కూర్‌ గ్రామంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అక్రమ మద్యం పట్టుకున్నారు. ఎస్సై కంకల సతీష్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎం.వెంకటయ్య తన వ్యవసాయ బావి వద్ద అక్రమ మద్యాన్ని నిల్వ చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం బావి వద్దకు వెళ్లి రూ.82 వేల విలువైన మద్యం సీజ్‌ చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌, సీఐ బాబులాల్‌, ఎస్సై వంశీకృష్ణ, కానిస్టేబుళ్లు రాజేందర్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

కోలుకొండలో ..

దేవరుప్పుల : మండలంలోని కోలుకొండ గ్రామంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శని వారం రాత్రి బెల్ట్‌ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 9,660 విలువైన మద్యం సీజ్‌ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ సీఐ రమేష్‌ తెలిపారు. అనంతరం బెల్ట్‌ షాపు నిర్వాహకులు కన్న ప్రశాంత్‌, కోతి లలిత, ఎండీ ఖదీర్‌ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

బచ్చన్నపేట: పట్టుబడిన మద్యాన్ని చూపుతున్న పోలీసులు

Advertisement
Advertisement