సందేశం కొట్టు.. వివరాలు పట్టు | Sakshi
Sakshi News home page

సందేశం కొట్టు.. వివరాలు పట్టు

Published Sun, Nov 12 2023 1:14 AM

- - Sakshi

కాజీపేట : ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. లేదా? ఉంటే ఏ పోలింగ్‌ బూత్‌లో ఉందో వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే తెలుసుకోండి. మీ సెల్‌ఫోన్‌ నుంచి ఒక ఎస్‌ఎంఎస్‌ (మెసేజ్‌) పంపితే మీ పోలింగ్‌ కేంద్రం వివరాలు వస్తాయి. ఓటర్లకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. ఓటరు తన సెల్‌ఫోన్‌ నుంచి 92251–66166, 92251–51969 నంబర్లకు టీఎస్‌ ఓటరు ఐడీ నంబర్‌ పంపితే మీ పేరు, పోలింగ్‌ కేంద్రం, చిరునామా సమాచారం వస్తుంది. టీఎస్‌ స్పేస్‌ వీవోటీఈ స్పేస్‌ ఓటరు ఐడీ నంబర్‌ పంపిస్తే వివరాలు వస్తాయి.

Advertisement
Advertisement