మా మామయ్యకు బంధుప్రీతి ఎక్కువ.. | Sakshi
Sakshi News home page

మా మామయ్యకు బంధుప్రీతి ఎక్కువ..

Published Sun, Nov 12 2023 1:14 AM

-

చంద్రమోహన్‌ నాకు మేనమామ. అతనికి ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లు. మా అమ్మ నాలుగో అక్క. 1985 ఫిబ్రవరిలో వరంగల్‌లో జరిగిన నా వివాహానికి హాజరయ్యారు. తనతో పాటు సెలబ్రేటీలను కూడా తీసుకొచ్చారు. మా మామయ్య వల్లే మాకు సెలబ్రేటీ స్టేటస్‌ కలిగింది. ఆయనకు బంధుప్రీతి ఎక్కువ. అందరితో ఆప్యాయంగా మాట్లాడేవారు. మూడు నెలల క్రితం మామయ్య ఇంటికి వెళ్లి చూసి వచ్చా. మామయ్య మృతి మా కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

– కొడిమెల బాలగంగాధర్‌ తిలక్‌, రామన్నపేట, వరంగల్‌, రిటైర్డ్‌ ఆర్ట్‌ మాస్టర్‌ హసన్‌పర్తి

ఏపీ రెసిడెన్సీయల్‌ గర్ల్స్‌ కాలేజ్‌

Advertisement
Advertisement