‘దీపావళి బతుకమ్మ’ సంబురాలు | Sakshi
Sakshi News home page

‘దీపావళి బతుకమ్మ’ సంబురాలు

Published Wed, Nov 15 2023 1:12 AM

నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్తున్న నేతకాని కులస్తులు - Sakshi

హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం సీతంపేటలో ‘దీపావళి(నేతకాని) బతుకమ్మ’ సంబురాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భక్తిశ్రద్ధలతో కేదారేశ్వరస్వామి వ్రతాన్ని ఆచరించారు. పురుషులే ఈ వ్రతాన్ని ఆచరించడం విశేషం. ఈ సందర్భంగా దేవుడి (ఎద్దులు) ప్రతిమలను ఊరేగించారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేసి, ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా చెరువు నుంచి నీటిని ఇంటికి తీసుకొచ్చి ప్రత్యేక గదిలో భద్రపరిచి పూజలు నిర్వహించారు.

నేడు ముగింపు..

మూడు రోజుల పాటు నిర్వహించే దీపావళి బతుకమ్మ వేడుకలు బుధవారం ముగియనున్నాయి. ఈ సందర్భంగా చెరువు వద్ద భారీ ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్‌ శరత్‌కుమార్‌ తెలిపారు. వేడుకలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని సర్పంచ్‌ శరత్‌కుమార్‌, ఎంపీటీసీ సభ్యురాలు బండారి రజిత తెలిపారు.

వైభవంగా కొనసాగుతున్న ఉత్సవాలు

నేడు ముగింపు..

చెరువు వద్ద పూజలు..
1/2

చెరువు వద్ద పూజలు..

జోడెద్దుల ప్రతిమల నిమజ్జనం..
2/2

జోడెద్దుల ప్రతిమల నిమజ్జనం..

Advertisement
Advertisement