నేడు విత్‌డ్రా, ఫైనల్‌ జాబితా | Sakshi
Sakshi News home page

నేడు విత్‌డ్రా, ఫైనల్‌ జాబితా

Published Wed, Nov 15 2023 1:16 AM

-

మానుకోట రిటర్నింగ్‌ అధికారి,

ఆర్డీఓ అలివేలు

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం మానుకోట నియోజకవర్గ అభ్యర్థుల విత్‌డ్రా ప్రక్రియ జరుగుతుందని, మధ్యాహ్నం 3.05గంటలకు ఫాం–7ఏలో అభ్యర్థుల పేర్లతో తుది జాబితా విడుదల చేస్తామని రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీఓ అలివేలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 13న స్క్రూట్నీ నిర్వహించగా 22మంది అభ్యర్థుల్లో ఏడుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. 15మందితో కూడిన జాబితా వెల్లడించామని చెప్పారు.

Advertisement
Advertisement