నిరంతర పర్యవేక్షణ ఉండాలి | Sakshi
Sakshi News home page

నిరంతర పర్యవేక్షణ ఉండాలి

Published Fri, Nov 17 2023 1:20 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శశాంక - Sakshi

మహబూబాబాద్‌: ఎన్నికల అధికారులు విస్తృతంగా పర్యటించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం స్టాటిస్టికల్‌ సర్వేలెన్స్‌ టీమ్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్స్‌, సీ–విజల్‌ యాప్‌ పనితీరుపై జనరల్‌ అబ్జర్వర్‌ ఇరా సింఘాల్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వారిని ఉపేక్షించేదిలేదన్నారు. ఎన్నికల అబ్జర్వర్లు పర్యటిస్తున్నారని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ రోజువారీ నివేదికలు అందజేయాలన్నారు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్లపై దృష్టిపెట్టాలని, ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. ర్యాలీలు, సమావేశాలలో ఏర్పాటు చేసే సామగ్రిని వీడియో తీయించాలని, తీసిన ప్రతీ వీడియోను అధికారులకు అందజేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ ఉన్నారు.

ఓటర్లకే అందజేయాలి..

ఓటరు గుర్తింపు కార్డులను సంబంధిత ఓటర్లకు మాత్రమే అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎపిక్‌ ఓటరుఫొటో గుర్తింపు కార్డుల పంపిణీపై ఎన్నికల విభాగం, పోస్టల్‌ విభాగం అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఆర్డర్‌ ఇచ్చిన కార్డుల వివరాలు, ప్రింట్‌ అయి వచ్చిన కార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 54,000 ఫొటో ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరే కార్డులు అందజేయాలని సూచించారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక

Advertisement
Advertisement