సభాస్థలిని పరిశీలించిన అడిషనల్‌ ఎస్పీ | Sakshi
Sakshi News home page

సభాస్థలిని పరిశీలించిన అడిషనల్‌ ఎస్పీ

Published Sat, Nov 18 2023 1:36 AM

- - Sakshi

మరిపెడ: మరిపెడలో ఈ నెల 21న నిర్వహించే డోర్నకల్‌ నియోజకవర్గ సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభా స్థలిని అడిషనల్‌ ఎస్పీ చెన్నయ్య పరిశీలించారు. సభా ప్రాంగణంతో పాటు హెలిపాడ్‌, వాహనాల పార్కింగ్‌, ప్రజలు వీక్షీంచేందుకు తగిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు డీఎస్పీ వెంకటేశ్వర బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపుడి నవీన్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గుగులోతు సింధూరరవికుమార్‌, సీఐ రాజు, ఎస్సై పవన్‌కుమార్‌, జెడ్పీటీసీ అరుణరాంబాబు, జెడ్పీటీసీ శారదరవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు కవాతు

దంతాలపల్లి: మండలంలోని పెద్దముప్పారం, బొడ్లాడ గ్రామాలలో కేంద్ర బలగాలతో కలిసి తొర్రూరు డీఎస్పీ వెంకటేశ్వరబాబు శుక్రవారం కవాతు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రశాతం వాతావరణంలో ఎన్నికల జరిగేలా ప్రజలు సహాకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రశాంతతకు అంతరాయం కలిగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తొర్రూర్‌ టౌన్‌ సీఐ సత్యనారాయణ, స్థానిక ఎస్సై రమేష్‌బాబు పాల్గొన్నారు.

వైద్యులు అందుబాటులో ఉండాలి

గూడూరు: మండలంలోని అయోధ్యపురం, తీగలవేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం డీఎంహెచ్‌ఓ అంబరీష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ రెండు ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, రోగుల హాజరు నమోదు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమయానుకూలంగా విధులకు హాజరుకావాలన్నారు. రోగికి అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు అందించాలన్నారు. అనంతరం తీగలవేణి పీహెచ్‌సీలోని గర్భిణులకు న్యూట్రీషియన్‌ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు యమున, వి.రాంబాబు, హెచ్‌ఈఓ లోక్యానాయక్‌, హేమలత, సర్దార్‌బాబు, శానుబేగం, దాసు, ఉదయశ్రీ,, సిబ్బంది పాల్గొన్నారు.

యువత ఓటు హక్కు వినియోగించుకోవాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని యువత వందశాంతం ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో శుక్రవారం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు ఓటరు అవగాహన, క్రీడా పోటీలు నిర్వహించగా.. ఆయన హాజరై క్రీడలను ప్రాంభించి మాట్లాడారు. యువత క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అదేస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని, నిస్వార్థంగా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములం అవుతామని యువతతో ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీపీఓ హరిప్రసాద్‌, జిల్లా యువజన క్రీడల అధికారి అనిల్‌ కుమార్‌,ప్రిన్సిపాళ్లు రాజు, సదానందం, పీఈటీలు వెంకటేశ్వర్లు, చాంప్లనాయక్‌, పుష్పలీల పాల్గొన్నారు.

మార్కెట్‌కు

పోటెత్తిన ధాన్యం

కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ శుక్రవారం ధాన్యం బస్తాలతో పోటెత్తింది. ఇటీవల సీజన్‌ ప్రారంభం కాగా.. అత్యధికంగా 10,155 బస్తాల ధాన్యం రావడంతో మార్కెట్‌లో షెడ్లు నిండిపోగా, ఓపెన్‌యార్డుల్లో ధాన్యాన్ని రాశులుగా పోసుకున్నారు. కాగా ఆర్‌ఎన్‌ఆర్‌(పాతవి) ధాన్యానికి గరిష్ట ధర రూ.2,915, కనిష్ట ధర రూ.2,589 పలుకగా, ఆర్‌ఎన్‌ఆర్‌(కొత్తవి) ధాన్యానికి గరిష్ట ధర రూ.2,766, కనిష్ట ధర రూ.2,026 పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు.

1/3

2/3

3/3

Advertisement
Advertisement