అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు మేలు | Sakshi
Sakshi News home page

అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు మేలు

Published Wed, Nov 22 2023 1:40 AM

స్టాళ్లను సందర్శిస్తున్న ఉమారెడ్డి, స్వర్ణలత, కేవీకే, వ్యవసాయ అధికారులు - Sakshi

మహబూబాబాద్‌ రూరల్‌: రైతులు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసి లాభాలు పొందాలని వరంగల్‌ ప్రాంతీయ పరిశోధనస్థానం సహ పరిశోధన సంచాలకులు ఆర్‌.ఉమా రెడ్డి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహాయ విస్తరణ సంచాలకులు ఐ.స్వర్ణలత అన్నారు. జాతీయ ఆహారభధ్రత పథకం వారి ఆర్థిక సౌజన్యంతో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై మహబూబాబాద్‌ మండలం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం కిసాన్‌ మేళా, వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తేలికపాటి (తక్కువ సారవంతమైన) భూముల్లో పత్తిని సాగు చేసే రైతులందరూ అధిక సాంద్రత పద్ధతిని పాటించి లాభాలు గడించాలని సూచించారు. ఈ ప్రాజెక్టుపై మానుకోట జిల్లాలో 208 ఎకరాల్లో క్షేత్ర ప్రదర్శనలు చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో ఈ సాగు పెరిగే అవకాశం ఉందన్నారు. పత్తి ప్రధాన శాస్త్రవేత్త జి.వీరన్న మాట్లాడుతూ.. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తే నవంబర్‌ చివరికల్లా పంటను తొలగించి రెండో పంట వేసుకోవచ్చన్నారు. దీంతో గులాబీ రంగు పురుగు ఉధృతిని అరికట్టవచ్చని సూచించారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ మాలతి, జిల్లా వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ, వరంగల్‌ శాస్రవేత్తలు డాక్టర్‌ వి.వెంకన్న, జి.పద్మజ, బి.మాధవి, జేవీఆర్‌ హెచ్‌ఆర్‌ఎస్‌ ప్రధాన శాస్రవేత్త కె.భాస్కర్‌, ప్రశాంత్‌, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎన్‌.కిశోర్‌ కుమార్‌, డాక్టర్‌ ఇ.రాంబాబు, బి.క్రాంతికుమార్‌, డి.ఉషశ్రీ, కాటన్‌ ప్రాజెక్ట్‌ వైపీలు, కేవీకే సిబ్బంది, 620 మంది రైతులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన 18 స్టాళ్లను వ్యవసాయ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement