కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

25 Nov, 2023 01:24 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ శశాంక, పక్కన ఎస్పీ

మహబూబాబాద్‌: ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుందని, అన్ని పార్టీల నాయకులు సహకరించాలని, కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. కోడ్‌కు లోబడి ఈ నెల 28వరకు ప్రచారం చేసుకోవాలన్నారు. సీ విజిల్‌లో 83 ఫిర్యాదులు రాకగా, 18మినహా అన్ని పరిష్కరించినట్లు చెప్పారు. సువిద ద్వారా అనుమతి తీసుకుని కరపత్రాలు, పోస్టర్లు ముద్రించుకోవాలన్నారు. ప్రచారం మెటీరియల్‌ విషయంలో ప్రీసర్టిఫికెట్‌ తీసుకోవాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పొందిన ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేయడానికి అవకాశం ఉందన్నారు. మన జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉన్నాయన్నారు. 3,500 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు బయటి నియోజకవర్గాల రావాల్సి ఉండగా.. 3,000 వచ్చాయని చెప్పారు. ఈనెల 27వ తేదీ వరకు గడువు ఉందన్నారు. రెండు నియోజకవర్గాల్లో హోం ఓటింగ్‌ జరిగిందని, మరోరోజు గడువు పెంచామనార్రు. ఓటరు స్లిప్పులు 93.7శాతం పంపిణీ చేశారన్నారు. ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ మాట్లాడుతూ.. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రత కల్పిస్తున్నామన్నారు.

సహకరించాలి..

మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కేసులు తగ్గించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ శశాంక కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం అఖిలపక్ష పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వీఐపీల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌ను యూజర్‌ చార్జీలు చెల్లించి వినియోగించుకోవచ్చన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక

మరిన్ని వార్తలు