ఖాతాదారులకు మెరుగైన సేవలు | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 1 2023 12:00 PM

రుణ, డిపాజిట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న ఏపీజీవీబీ సిబ్బంది    - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఖాతాదారులకు ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంక్‌ మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆ బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ జి.సుభాష్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో మంగళవారం పట్టణంలోని ఏపీజీవీబీ శాఖల ఆధ్వర్యంలో రుణ, డిపాజిట్లపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రీజినల్‌ మేనేజర్‌ మాట్లాడుతూ తమ బ్యాంక్‌ హౌజింగ్‌ లోన్‌ 8.45శాతం తక్కువ వడ్డీ ఉందని, డిపాజిట్లపై 8 శాతం 777 రోజులకు, 7.60 శాతం 444 రోజులకు, 60 ఏళ్లు పైబడిన వారికి 777 రోజులకు 7.50శాతం, 444 రోజులకు 7.10 శాతం వడ్డీ లభిస్తుందన్నారు. తమ బ్యాంక్‌లో సామాజిక భద్రత కింద రూ.436లతో ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన రూ.2 లక్షల ఇన్స్‌రెన్స్‌, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, 40 ఏళ్లలోపు వారు ప్రతి నెల క్రమం తప్పని పొదుపుతో 60 ఏళ్లు దాటిన తర్వాత రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పెన్షన్‌ పొందే సౌకర్యం ఉందని తెలిపారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏపీజీవీబీ సీనియర్‌ మేనేజర్‌ (బిజినెస్‌) మెర్సి అంబటి, సీనియర్‌ మేనేజర్‌ (ఆపరేషన్స్‌) టీఎస్‌.రంగారావు, మహబూబ్‌నగర్‌ శాఖ చీఫ్‌ మేనేజర్‌ కె.శ్రీనివాస్‌, రుణ ప్రాసెసింగ్‌ సెంటర్‌ సీనియర్‌ మేనేజర్‌ అజయ్‌కుమార్‌, పాతపాలమూర్‌ శాఖ మేనేజర్‌ యూ.రవికాంత్‌, భగీరథకాలనీ శాఖ మేనేజర్‌ జి.నితీష్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఏపీజీవీబీ రీజినల్‌ మేనేజర్‌ జి.సుభాష్‌

రుణ, డిపాజిట్లపై అవగాహన

Advertisement
Advertisement