రూ.10వేల వరకు సంపాదన | Sakshi
Sakshi News home page

రూ.10వేల వరకు సంపాదన

Published Sun, Mar 12 2023 4:20 AM

- - Sakshi

మిల్లేట్‌ ఫుడ్‌ ఉత్పత్తులు అమ్మకాలతో నెల కు రూ.10వేల వరకు సంపాస్తున్నా. సంప్రదాయ వస్తువుల ఉత్పత్తులను ప్రచారం చే యాలనే ఉద్దేశంతో కొ ర్రలు, సామెలు, అండు కొర్రలు వంటి మిల్లెట్ల రొట్టెలు, ముర్కులు అమ్ముతా. మిల్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

– సురేఖ, జిల్లా మహిళాసమాఖ్య అధ్యక్షురాలు

గిరాకీ బాగుంది..

జిల్లాకేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట మహాస్టోర్‌ మాది. ఇందులో పేపర్‌ బ్యాగులు, పేపర్‌ ఫ్లవర్లతోపాటు క్లాత్‌ బ్యాగులు, జ్యూట్‌ బ్యాగులు, టోపీలు అమ్ముతాము. దీంతోపాటు పచ్చళ్లు కూడా ఉంటాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో గిరాకీ బాగుంటుంది.

– శ్రుతి, మహా స్టోర్‌ నిర్వాహకురాలు

నష్టం లేకుండా వ్యాపారం..

సహజ సిద్ధమైన ఉత్పత్తులను ప్రజలకు అందించా లనే ఉద్దేశంతో వీటిని తయా రు చేస్తున్నా. ముఖ్యంగా ఇందులో తలకు అంటించుకునే హర్బల్‌ ఆయిల్‌, సబ్బులు, షాంపులు ఉంటాయి. వాట్సాప్‌, పరిచయం ఉన్న వారి ద్వారా, స్టాళ్లు పెట్టి మార్కెటింగ్‌ చేస్తా. నష్టం లేకుండా వ్యాపారం నడుస్తుంది.

– మౌనిక, ధర్మాపూర్‌

ప్లాస్టిక్‌ వాడొద్దనే..

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి హాని జరుగుతుంది. ప్లాస్టిక్‌ వాడవద్దనే ప్రజల్లో అవగాహన కోసం సహజమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. జ్యూట్‌ బ్యాగులు, పర్సులు, క్లాత్‌ బ్యాగులు, పేపర్‌ బ్యాగులు ఉన్నాయి. ఈ ఉత్పత్తులను మహా బ్రాండ్‌ పేరుతో బస్టాండ్‌ చౌరస్తాలోని డ్వాక్రా భవనంలో స్టాల్‌ ద్వారా విక్రయిస్తున్నాం.

– మహేశ్వరి, మహా స్టోర్‌ నిర్వాహకురాలు

ఉపాధి లభిస్తుంది..

మహా బ్రాండ్‌ ఉత్పత్తి విక్రయ కేంద్రం మయూరి పార్క్‌ ముందు 6 నెలల క్రితం ఏర్పాటు చేశాం. ఇందులో నూనెలు, ఫినాయిల్‌, హేర్‌ ఆయిల్‌, సబ్బులు, కొర్రలు, సామెలు, ముర్కులు ఈ విక్రయ కేంద్రంలో ఉంచాం. దీంతో ఉపాధి పొందుతున్నాం.

– రాజమణి, జమిస్తాపూర్‌

1/3

2/3

3/3

Advertisement
Advertisement