సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

Published Tue, Mar 21 2023 1:58 AM

తెలంగాణ చౌరస్తాలో నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు   - Sakshi

పాలమూరు: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌పై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర కోశాధి కారి శాంతికుమార్‌, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచా రి అన్నారు. సోమవారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి తెలంగాణ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రివర్గం నుంచి కేటీఆర్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని డి మాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష రాసిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించాలన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని, కేటీఆర్‌ బాధ్యతారహితంగా తమకు ఏం సంబంధం ఒకరిద్దరు చేశారని మాట్లాడటం దారుణం అన్నారు. పేపర్‌ లీక్‌ టెక్నికల్‌ అంశమైన దానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చి.. ఈ పేపర్లు దొంగవ్యవహారంగా నడిపించి ఇప్పుడు అక్టోబర్‌ నుంచి నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలని చెప్పడం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, నాయకులు ఎన్‌పీ వెంకటేష్‌, అంజయ్య, పాండురంగారెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామాంజనేయులు, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement