వేడికి విలవిల! | Sakshi
Sakshi News home page

వేడికి విలవిల!

Published Tue, Apr 4 2023 6:32 AM

మహబూబ్‌నగర్‌ మండలంలో పెంకుటిల్లులో కొనసాగుతున్న ఓ అంగన్‌వాడీ కేంద్రం  - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: వేసవినేపథ్యంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సగటున 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిత్యం ఉదయం 10 గంటలకే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. అలాగే వారం రోజుల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగిస్తున్నారు. ఆరేళ్లలోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా విద్యాబోధన చేపడుతుండగా కేంద్రాల్లో కరెంటు, ఫ్యాన్ల సౌకర్యం లేక చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు.

పంచాయతీలకు భారం..

అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు సంబంధిత సీ్త్ర, శిశు సంక్షేమశాఖ నుంచి నిధులు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా గ్రామ పంచాయతీలే విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే ఏయే అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్‌ కనెక్షన్లు లేవన్న కనీస సమాచారం కూడా సంబంధిత శాఖ అధికారుల వద్ద లేదు. దీన్ని బట్టే అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారం కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. చాలావరకు గ్రామ పంచాయతీలు సైతం ఈ విషయంపై దృష్టిపెట్టకపోవడంతో ఆయా అంగన్‌వాడీ కేంద్రాలు కరెంట్‌ సరఫరాకు నో చుకోవడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో4,322 కేంద్రాలు ఉంటే 2,456 కేంద్రాలకు విద్యుత్‌ సౌకర్యం ఉండగా... 1,866 కేంద్రాలకు లేదు.

ఒకే గదిలోనే..

ఉమ్మడి జిల్లాలోని చాలా అంగన్‌వాడీ కేంద్రాలకు కనీసం కరెంటు సౌకర్యం లేదు. కేంద్రాల్లో ఫ్యాన్లు అందుబాటులో లేక పెరుగుతున్న ఎండలకు చిన్నారులు అల్లాడుతున్నారు. అద్దె భవనాలు, ఇరుకై న గదులు, వెలుతురు లేని చీకటి గదులతో చిన్నారులు సతమతమవుతున్నారు. ఆరేళ్లలోపు చిన్నారులు కరెంటు, ఫ్యాన్లు, లైట్లు లేని గదుల్లో అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలను ఒకే గదిలో నిర్వహిస్తూ చిన్నారులను కూర్చోబెట్టడంతో పాటు అదే గదిలో వంట చేస్తుండటంతో వేడి మరింత పెరుగుతోంది.

అంగన్‌వాడీ కేంద్రాల్లోవసతులు కరువు

గదుల్లో ఫ్యాన్లు, వెలుతురుకునోచుకోని వైనం

చాలా సెంటర్లకు కరెంట్‌ సరఫరా లేక తీవ్ర అవస్థలు

వేసవిలో వర్ణనాతీతంగా ఇబ్బందులు

విద్యుత్‌ కనెక్షన్‌ భారం పంచాయతీలకే

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement