రైతులను సంక్షోభంలో నెట్టొద్దు | Sakshi
Sakshi News home page

రైతులను సంక్షోభంలో నెట్టొద్దు

Published Mon, Aug 21 2023 12:42 AM

-

మరికల్‌: చిత్తనూర్‌ ఇథనాల్‌ కంపెనీ నుంచి వెలువడే కాలుష్యంతో రైతులను సంక్షోభంలోకి నెట్టొద్దని తెలంగాణ విద్యా వంతుల వేదిక నాయకుడు బైరెడ్డి సతీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం కంపెనీ ఎదురుగా చేట్టిన రిలే దీక్షలో ఆయన మాట్లాడుతూ.. కంపెనీకి వ్యతిరేకంగా రైతులు రెండేళ్ల నుంచి పోరాటాలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. ఇథనాల్‌ కంపెనీ వల్ల భవిష్యత్‌లో కెమికల్‌ వెలువడి ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. వెంటనే కంపెనీ రద్దు చేసేందుకు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని రైతులకు మద్దతుగా పోరాటం చేయాలన్నారు. లేకుంటే రాబోవు ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యాయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రాఘవచారి, లక్ష్మయ్య, నాగభూషణ, చంద్రశేఖర్‌, శివారెడ్డి, శ్రీదేవి, మురళీధర్‌గుప్తా పాల్గొన్నారు.

Advertisement
Advertisement