పొగ కష్టాలకు విముక్తి కల్పిస్తాం | Sakshi
Sakshi News home page

పొగ కష్టాలకు విముక్తి కల్పిస్తాం

Published Fri, Oct 27 2023 12:52 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఇంకా అక్కడక్కడా కట్టెల పొయ్యిపై మహిళలు వంట చేస్తున్నారంటే అందుకు కేంద్రంలోని బీజేపీ విధానాలే కారణమని రాష్ట్ర ఎకై ్సజ్‌, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. గురువారం ఉదయం పాలకొండలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆ కాలనీలోని తిరుపతమ్మ ఇంటికి వెళ్లగా అక్కడ ఆమె కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ కనిపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధరలు పెంచడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ కష్టాలు తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఎదిరలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అమలు కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ వంచిస్తోందని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలో నాలుగు నెలలైనా ముగియకముందే సరైన విద్యుత్‌ ఇవ్వకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అక్కడ వారు ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలను అందరి దృష్టికి తెచ్చేందుకే కొడంగల్‌, గద్వాలకు వచ్చి ఆందోళనలకు దిగారని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకం ద్వారా రైతులకు జరుగుతున్న లబ్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కుట్రతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నారన్నారు.ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే ఉండే ప్రతిపక్షాల నాయకులు నవంబర్‌ 30 తర్వాత పత్తా లేకుండా పోతారన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కె.వెంకటయ్య, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌కుమార్‌, కౌన్సిలర్లు మూషా నరేందర్‌, తోకల యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఎకై ్సజ్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Advertisement
Advertisement