అప్పట్లో గిట్టుబాటు అయ్యేది | Sakshi
Sakshi News home page

అప్పట్లో గిట్టుబాటు అయ్యేది

Published Thu, Nov 9 2023 1:26 AM

మహబూబ్‌నగర్‌లోని రైల్వేస్టేషన్‌ వద్ద ఆటో డ్రైవర్లు  - Sakshi

15 ఏళ్ల క్రితం పట్టణంలో ఆటోలు నడిపితే గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు ఆటోలు కూడా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు రూ.400లు వచ్చినా డీజిల్‌కే రూ.200 పోతుంది. దీంతో సరైన ఆదాయం రాకపోతుండడంతో కుటుంబ పోషణ భారమైంది. మా ఆటో కార్మికులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి.

– ఆంజనేయులు

తప్పని పరిస్థితుల్లో..

నేను 33 ఏళ్ల నుంచి జిల్లాకేంద్రంలో ఆటో నడుపుతున్న. అప్పట్లో మొత్తం కలిపితే 180 ఆటోలు ఉండేవి. రోజుకు డీజిల్‌ పోను రూ.100 వచ్చినా కుటుంబ పోషణకు ఇబ్బంది లేకుండే. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు తలుచుకుంటేనే భయమేస్తోంది. వయస్సు మీద పడుతున్నా తప్పని పరిస్థితుల్లో ఆటో నడుపుతున్న. ఆటోల ఇన్సూరెన్స్‌ తగ్గించాలి. – ఎం.లక్ష్మయ్య

ఏపీ మాదిరిగా..

న దగ్గర కూడా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా అందిస్తే బాగుంటుంది. ఆటో డ్రైవర్లకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. ఆటోడ్రైవర్లకు ప్రమాదం జరిగితే వారికి, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. పెరిగిన డీజిల్‌ ధరలు, పోలీసుల చలాన్లు, ఫైనాన్స్‌ కిస్తులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నాం. – షేక్‌ బాబుమియా

1/3

2/3

3/3

Advertisement
Advertisement