పోలింగ్‌ బూత్‌లో ప్రత్యేక నిబంధనలు | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ బూత్‌లో ప్రత్యేక నిబంధనలు

Published Thu, Nov 23 2023 1:00 AM

-

అచ్చంపేట: ఎన్నికల పోలింగ్‌ రోజున బూత్‌కు వచ్చిన ఓటరు గోప్యతను పాటించకుండా ఓటును బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తే.. ఎన్నికల నిబంధనలు ఉల్లఘించినట్లుగా అధికారులు భావించి సదరు వ్యక్తి ఓటును వేయడానికి అనుమతించరు. అలాగే అంధుడై ఉండి, ఎన్నికల గుర్తును గుర్తించలేని పరిస్థితి ఉంటే.. అతనితోపాటు ఓవ్యక్తిని పోలింగ్‌ బూత్‌లోకి అధికారులు అనుమతిస్తారు. అంధత్వ వ్యక్తికి సహాయంగా వెళ్లే వ్యక్తికి 18 ఏళ్లు నిండి, ఏదేని గుర్తింపు కార్డు తీసుకువస్తేనే అనుమతిస్తారు. అలాగే ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతడి ఓటును అప్పటికే ఎవరైనా వేస్తే, టెండర్‌ ఓటుగా పరిగణించి, పోలింగ్‌ అధికారుల వద్ద ఉండే బ్యాలెట్‌ పేపర్‌లో ఒక పేపర్‌ ఇస్తే, దానిపై పాత పద్ధతిలో ఓటు వేయవచ్చు. ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పడు బోగస్‌ ఓటని, తక్కువ వయస్సు అని పోలింగ్‌ ఏజెంట్లు ఛాలెంజ్‌ చేస్తే పోలింగ్‌ అధికారి ఏజెంట్‌ నుంచి విషయాలు సేకరిస్తారు. ప్రాథమిక విచారణ చేసి, ఆరోపణ నిజమైతే సదరు ఓటర్‌ను పోలీస్‌ సిబ్బందికి అప్పగిస్తారు. ఒక ఓటర్‌ తాను నచ్చిన పార్టీకి ఓటు వేస్తే, అది వేరే పార్టీకి పడ్డట్లు ఆరోపణలు చేస్తే అధికారులు టెస్టు ఓటుకు అనుమతిస్తారు. అయితే ఆ ఆరోపణ రుజువు కాకుంటే చర్యలు తీసుకుంటామని కూడా సదరు ఓటర్‌ను ముందే హెచ్చరిస్తారు.

Advertisement
Advertisement