లెక్కింపు కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

లెక్కింపు కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు

Published Fri, Nov 24 2023 1:16 AM

ఏర్పాట్లు పరిశీలిస్తున్న సాధారణ ఎన్నికలపరిశీలకులు సంజయ్‌కుమార్‌మిశ్రా తదితరులు  - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటు విషయమై గురువారం సాధారణ ఎన్నికల పరిశీలకులు సంజయ్‌కుమార్‌మిశ్రా, జిల్లా పోలీస్‌ పరిశీలకురాలు ఇలక్కియా కరుణాకరన్‌, కలెక్టర్‌ రవినాయక్‌, ఎస్పీ హర్షవర్ధన్‌, పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్‌, రిజిస్ట్రార్‌ గిరిజమంగతాయారు, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఇండోర్‌ స్టేడియం, లైబ్రరీ, ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ తదితర భవనాలను పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన విధంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సంబంధించి పూర్తి వివరాలతో సహా మ్యాపు, కొలతలు, డయాగ్రమ్‌ వంటివి తక్షణమే తయారు చేయాలని సంజయ్‌ కుమార్‌మిశ్రా అధికారులకు సూచించారు. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు అనిల్‌కుమార్‌, మోహన్‌రావు, నటరాజ్‌, పీఆర్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ నరేందర్‌రెడ్డి, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కిషన్‌రావు, రెవెన్యూ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పిల్లలమర్రి సందర్శన

పిల్లలమర్రి వృక్షాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు సంజయ్‌కుమార్‌ మిశ్రా, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కుందన్‌యాదవ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలమర్రి చరిత్రను జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి శ్రీనివాస్‌, డీవైఎస్‌ఓ శ్రీనివాస్‌, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజినీర్‌ ఇస్రానాయక్‌, లైజన్‌ అధికారి వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement