ఎవరి లెక్కలు వారివే..! | Sakshi
Sakshi News home page

ఎవరి లెక్కలు వారివే..!

Published Sat, Dec 2 2023 1:04 AM

- - Sakshi

పోలింగ్‌ బూత్‌ల వారీగా గణన

గ్రామాలు, పట్టణాల్లో పోలింగ్‌ సరళిపై చర్చ

తామే గెలుస్తామని ఎవరికి వారు ధీమా

పలు ప్రాంతాల్లో జోరుగా బెట్టింగ్‌లు

మహబూబ్‌నగర్‌, వనపర్తి, దేవరకద్ర, జడ్చర్ల, కొడంగల్‌పై పోటాపోటీ

నారాయణపేట, నాగర్‌కర్నూల్‌,

కొల్లాపూర్‌పై సైతం..

రేపు ఓట్ల లెక్కింపు..

అదే రోజు సస్పెన్స్‌కు తెర

మ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్‌ జోరుగా సాగుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌, వనపర్తి, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ పోటీ చేసిన కొడంగల్‌తో పాటు దేవరకద్ర, జడ్చర, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌పై బెట్టింగ్‌లు కాస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌, రంగారెడ్డితో తదితర ప్రాంతాలకు చెందిన పందెం రాయుళ్లు రియల్టర్లు, బడా వ్యాపారులతో బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు వినికిడి. పలు ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జిలను కేంద్రంగా చేసుకుని భారీ ఎత్తున బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యే అభ్యర్థుల సమాలోచనలు

1/5

2/5

3/5

4/5

5/5

Advertisement
Advertisement