జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో | Sakshi
Sakshi News home page

జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో

Published Sat, Dec 2 2023 1:04 AM

-

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో స్వల్పంగా కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 7గంటల వరకు 1,663 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 88, కోయిల్‌ సాగర్‌కు 315, ఎడమ కాల్వకు 390, కుడి కాల్వకు 442, ఆర్డీఎస్‌ లింక్‌ కెనాల్‌కు 300 క్యూసెక్కులతో కలిపి మొత్తం 1,235 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.608 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement