జూరాలకు కొనసాగుతున్న వరద | Sakshi
Sakshi News home page

జూరాలకు కొనసాగుతున్న వరద

Published Wed, Dec 6 2023 1:08 AM

-

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోలు స్వల్పంగా కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 342 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 67 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 338 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 673 క్యూసెక్కులు, భీమా లిఫ్టు 2కు 544 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 1,468 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.126 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నిండుకుండలా కోయిల్‌సాగర్‌..

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నీటితో నిండు కుండలా మారింది. గత నెల ప్రారంభం వరకు వానాకాలం పంటలకు, గొలుసు కట్టు చెరువులకు నీటిని విడుదల చేస్తూ.. వచ్చారు. పంటలు చేతికి రావడంతో ప్రాజెక్టు రెండు కాల్వలను మూసివేశారు. ప్రాజెక్టు నీటి మట్టం తగ్గడంతో తిరిగి జూరాల నుంచి ఎత్తిపోతల పథకం ద్వార నీటిని విడుదల చేస్తూ.. వచ్చారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32.6 అడుగులు కాగా.. మంగళవారం సాయంత్రం వరకు 32.3 అడుగులకు చేరింది. కేవలం 0.3 ఈంచుల నీరు మాత్రమే తక్కువగా ఉంది. అయితే ప్రాజెక్టులో గాలితో ఆలలు వస్తుండడంతో గేట్ల నుంచి నీరు జాలువారుతుంది. ఈ ఏడాది యాసంగి పంటలకు నీటిని వదిలే విషయం ఇంకా అధికారులు ప్రకటించలేదు. వర్షాభావ పరిస్థితులు కారణంగా ప్రాజెక్టు నిల్వ ఉన్న నీటిని వేసవి వరకు తాగునీటి కోసం ఉపయోగించే అవకాశం ఉన్నట్లు అధికారులు గతంలో ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement