రాజకీయాల్లో చురుకై న వ్యక్తి.. | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో చురుకై న వ్యక్తి..

Published Thu, Dec 7 2023 12:26 AM

- - Sakshi

రాజకీయ వ్యవహారంలో చాలా చురుకుగా పాల్గొనేవాడు. అతడు మొదట జెడ్పీటీసీగా గెలిచిన సందర్భంలో ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అగుడుపెడతానని, భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతానని చెబితే మేమంతా ఆశ్చర్యానికి గురయ్యేవారం. చివరకు రేవంత్‌రెడ్డి తన కలను సాకారం చేసుకోవడం సంతోషంగా ఉంది.

– తిరుపతిరెడ్డి, కల్వకుర్తి

డైనమిక్‌ లీడర్‌ సీఎం అయ్యాడు..

కల్వకుర్తి ప్రాంతానికి చెందిన డైనమిక్‌ లీడర్‌ రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం గొప్ప విషయం. అతడిని చూసే నేను రాజకీయాలలోకి వచ్చాను. రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో మా ప్రాంత ఖ్యాతి మరింత పెరిగింది. నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్‌రెడ్డికి మా ప్రాంతం తరఫున శుభాకాంక్షలు.

– సంతోష్‌, కల్వకుర్తి

సీఎం ఊరుగా మారిపోయింది..

రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిని ఇప్పుడు అందరూ సీఎం ఊరూ అని అంటున్నారు. ఇక్కడి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంతి కావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు.

– వేమారెడ్డి, కొండారెడ్డిపల్లి

పాలమూరుకు మంచి రోజులు..

పాలమూరు బిడ్డ సీఎం కావడంతో జిల్లాకు మంచి రోజులు వచ్చాయి. ఈ ప్రాంత బిడ్డగా రేవంత్‌రెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.

– శ్రీరాములు, గద్వాల

సమస్యలు పరిష్కరించాలి..

ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. రాష్ట్ర సరిహద్దులోని గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో విద్య, వైద్యరంగాలు వెనుకబాటుకు గురయ్యాయి. ప్రజలకు అన్ని సదుపాయాలను సమకూర్చాలి.

– భీమేశ్వర్‌రెడ్డి, మానవపాడు

సాగునీటి ప్రాజెక్టులపై

దృష్టి పెట్టాలి..

జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం గర్వించాల్సిన విషయం. సొంత జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు నీరందేలా ప్రణాళికలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొనసాగుతున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు త్వరగా పూర్తి చేయాలి.

– వెంకట్‌రెడ్డి, పొల్మూరు, తాడూరు మండలం

జిల్లాకే గర్వకారణం..

నల్లమల ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎం కావడం ఎంతో గర్వకారణం. సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి సీఎం కావడం గొప్ప విషయం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగుతాయనే నమ్మకం ఉంది. ప్రస్తుత మేనిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరం. – శారదమ్మ, అచ్చంపేట

నిరుద్యోగులకు

అండగా నిలవాలి..

రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో అచ్చంపేట ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ విశ్వాసం, నమ్మకంతోనే కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు గెలిపించారు. నిరుద్యోగులకు అండగా నిలవాలి. ఈ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.

– పులిజాల రవికుమార్‌గౌడ్‌,

గోదల్‌, బల్మూర్‌ మండలం

1/7

2/7

3/7

4/7

5/7

6/7

7/7

Advertisement
Advertisement