మహిళా ప్రయాణికులకుజీరో టికెట్లు అందజేత | Sakshi
Sakshi News home page

మహిళా ప్రయాణికులకుజీరో టికెట్లు అందజేత

Published Sat, Dec 16 2023 12:54 AM

- - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం మహిళలకు టిమ్‌ ద్వారా జారీ చేస్తున్న మహాలక్ష్మి జీరో టికెట్ల జారీ విధానాన్ని శుక్రవారం రీజినల్‌ మేనేజర్‌ శ్రీదేవి పరిశీలించారు. అదే విధంగా బస్సుల్లో మహిళల గుర్తింపు కార్డులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిమ్‌లో కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేశామని, దీంతో మహిళలకు మహాలక్ష్మి జీరో టికెట్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో మహిళలు గుర్తింపు కార్డు వెంట తీసుకువచ్చేలా కండక్టర్లు అవగాహన కల్పించాలని కోరారు. సాధారణ మహిళలతో పాటు బస్సుల్లో ప్రయాణించే ఇతర అన్ని రకాల పాసులు (ఉచిత, రూట్‌) ఉన్న విద్యార్థులకు, నెలవారీ సీజన్‌ టికెట్‌ ఉన్న మహిళలకు, పీహెచ్‌సీ పాసులు ఉన్న మహిళలకు తప్పనిసరిగా జీరో టికెట్‌ జారీ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం పలువురు మహిళలకు జీరో టికెట్లు అందజేశారు.

వెల్ఫేర్‌ బోర్డు సభ్యులతో సమావేశం

ఆర్టీసీ రీజినల్‌ కార్యాలయంలో శుక్రవారం ఆర్‌ఎం శ్రీదేవి రీజియన్‌లోని పలు డిపోలకు చెందిన వెల్ఫేర్‌ బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మి పథకం పకడ్బందీగా అమలయ్యేలా వెల్ఫేర్‌ బోర్డు సభ్యులు తగిన చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ బాబునాయక్‌, పీఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

22న జిల్లాస్థాయి యువజన సాంస్కృతిక పోటీలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఈనెల 22వ తేదీన జిల్లాస్థాయి యువజన సాంస్కతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్‌.శ్రీనివాస్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 15–29 ఏళ్ల యువత పోటీల్లో పాల్గొనవచ్చని, దరఖాస్తులను ఈనెల 21లోగా మెయిన్‌ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో అందజేయాలని కోరారు. గ్రూప్‌ల వారీగా, సోలో జానపద నృత్యాల పోటీలు ఉంటాయని, భారతదేశ సంప్రదాయ జానపద నృత్యాలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రూప్‌, సోలో జానపద గీతాలు, ఇంగ్లిష్‌లో వ్యాసరచన, పోస్టర్‌ మేకింగ్‌, ఉపన్యాసం, ఫొటోగ్రఫీ పోటీలతో పాటు యువ క్రిటీలో హ్యాండిక్రాఫ్ట్స్‌, టెక్స్‌టైల్స్‌, ఆగ్రో ఉత్పత్తుల కేటగిరీలో ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమ స్థానానికి ఎంపికై న వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని, మిగతా వివరాల కోసం 9441565895 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement