పారిశుద్ధ్యం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

Published Sat, Dec 16 2023 12:54 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ రవినాయక్‌   - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: గ్రామాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్‌ రవినాయక్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి అమలు తీరుపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రోజు ఉదయమే గ్రామాలకు చేరుకుని క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. ఉపాధి హామీ పథకం, శానిటేషన్‌ వంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలన్నారు. ఉపాధి పనుల్లో కూలీల నమోదును పెంచాలన్నారు. సమయానికి చెల్లింపులు చేయాలని, మస్టర్‌ రోల్‌ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. పంచాయతీ ఆస్తులు, భవనాల వివరాలను, 10 శాతం లేఅవుట్‌లతో సహా పూర్తి వివరాలను సేకరించి సమర్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో విద్యుత్‌ బిల్లులు అనవసరంగా పెరిగిపోకుండా మోటార్లు వినియోగించాలని, నిర్దేశించిన ప్రకారం విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని సూచించారు. ఇంటి పన్నులపై దృష్టి సారించి నూరుశాతం వసూలు చేయాలన్నారు. జిల్లాలో కేవలం 40 శాతం మాత్రమే పన్ను వసూలు ఉందని, దీన్ని పెంచాలన్నారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని, పంపిణీ చేసిన స్పోర్ట్స్‌ కిట్‌లను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం నర్సరీల ఏర్పాటులో బ్యాగ్‌ ఫిల్లింగ్‌, విత్తనాలు వేయటం వంటి పనులను చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద నాటే ఉద్యాన మొక్కలపై దృష్టి సారించి త్వరితగతిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. డీఆర్డీఓ యాదయ్య, డీపీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ జ్యోతి, డీఎఫ్‌ఓ సత్యనారాయణ, హార్టికల్చర్‌ ఏడీ సాయిబాబా పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement