అద్దె గదిలో ఉంటున్నా.. | Sakshi
Sakshi News home page

అద్దె గదిలో ఉంటున్నా..

Published Sat, Dec 16 2023 12:54 AM

- - Sakshi

నేను కల్వకుర్తి మండలం రఘుపతిపేట వీఆర్‌ఏగా ఉన్నప్పుడు ఊరిలోనే ఉండి అధికారులకు సమాచారం ఇచ్చేవారం. అధికారుల ఆదేశాల మేరకు పని ఉన్న సమయంలోనే తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చేదాన్ని. ప్రస్తుతం వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు తర్వాత కల్వకుర్తి బాలికల ఉన్నత పాఠశాలలో ఆఫీస్‌ సబార్డినేట్‌తోపాటు స్వీపర్‌గా పనిచేస్తున్నా. నైట్‌ వాచ్‌మెన్‌ డ్యూటీ కూడా వేయడంతో పట్టణంలోనే ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నా. వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నా.

– సాయమ్మ, ఆఫీస్‌ సబార్డినేట్‌, విద్యాశాఖ, కల్వకుర్తి

అర్థం కాని పరిస్థితి..

కల్వకుర్తి రెవెన్యూ విభాగంలోనే సర్దుబాటులో భాగంగా ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్నా. నాకు ఈ ఆర్థిక ఏడాదితో 61 ఏళ్ల సర్వీసు పూర్తవుతుంది. వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు కావడంతో నాతోపాటు నా కుటుంబ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. 61 ఏళ్లు నిండిన వారందరి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్న అప్పటి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా మారడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వమైనా మా సమస్యను పరిష్కరించాలి.

– పుల్లయ్య, ఆఫీస్‌ సబార్డినేట్‌, రెవెన్యూ, కల్వకుర్తి

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement