నారాయణపూర్‌లో 11 ఇళ్లలో చోరీ | Sakshi
Sakshi News home page

నారాయణపూర్‌లో 11 ఇళ్లలో చోరీ

Published Sun, Dec 17 2023 10:16 AM

నారాయణపూర్‌లో ధ్వంసమైన బీరువా   - Sakshi

వెల్దండ: మండలంలోని నారాయణపూర్‌లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరికి పాల్పడారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం. ఎస్‌ఐ శ్రీనివాస్‌ సిబ్బందితో గ్రామాన్ని సందర్శించి చోరికి గురైన ఇళ్లను పరిశీలించారు. గ్రామానికి చెందిన ఆర్‌.అచ్చాలి ఇంట్లో తులంన్నర బంగారం, రూ.40వేల నగదు, ఎన్‌. గోపాల్‌ ఇంట్లో అర తులం బంగారుతో పాటు రూ.10వేల నగదు, జగిరి ఇంట్లో క్వింటాల్‌ బియ్యం, రూ.7వేల నగదు, ఎం.తారాసింగ్‌ ఇంట్లో రూ.5వేల నగదు, డేరంగుల మల్లేష్‌ ఇంట్లో అర తులం బంగారు, రూ.10వేల నగదు, సిరమోని అంజమ్మ ఇంట్లో రూ.7వేల నగదు, నారమ్మ ఇంట్లో రూ.10వేల నగదు, రాములు ఇంట్లో 30తులాల వెండి గొలుసులు, శంకర్‌, బాలస్వామి ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈనెల 13న తిమ్మినోనిపల్లిలో 7ఇళ్లలో చోరికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఏకంగా 11ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ విషయం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

పెబ్బేరులో బైక్‌..

పెబ్బేరు రూరల్‌: పట్టణంలోని న్యూ రఘు వైన్స్‌ వద్ద ఓ బైక్‌ చోరీ అయ్యింది. ఎస్‌ఐ జగదీశ్వర్‌ వివరాల మేరకు.. పెబ్బేరు పట్టణానికి చెందిన భీష్మాచారి శనివారం న్యూ రఘు వైన్స్‌ ఎదుట బైక్‌ నిలిపారు. వ్యక్తిగత పనిమీద బయటికి వెళ్లి వచ్చేసరికి బైక్‌ కనిపించలేదు. వెంటనే అతడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రెండో వివాహంతో మోసం

యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు

మహమ్మదాబాద్‌: మొదటి వివాహమంటూ ఓ వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిన యువతి, ఆమె కుటుంబీకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సురేష్‌ వివరాల మేరకు.. మహబూబ్‌నగర్‌ జిల్లా మహమ్మదాబాద్‌ మండలంలోని జూలపల్లి తండాకు చెందిన ప్రశాంత్‌కు గతనెల 29న మహబూబ్‌నగర్‌కు చెందిన కొర్ర స్రవంతితో వివాహమైంది. అయితే అంతకు ముందే సదరు యువతికి మరో వ్యక్తితో వివాహం జరిగింది. మొదటి భర్తపై కేసు కూడా నమోదయ్యిందని.. ఆ విషయం చెప్పకుండా ప్రశాంత్‌ను రెండవ వివాహం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శనివారం కొర్ర స్రవంతి, ఆమె కుటుంబీకులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement