ప్లాట్లకే పరిమితం | Sakshi
Sakshi News home page

ప్లాట్లకే పరిమితం

Published Mon, Dec 18 2023 12:38 AM

వరద గుప్పిట్లో అలంపూర్‌ (ఫైల్‌) 
 - Sakshi

రదల్లో అలంపూర్‌ పట్టణం దాదాపు 30 రోజులు నీటిలోనే ఉండిపోయింది. నాటి ముఖ్యమంత్రి రోశయ్య స్వయంగా పట్టణాన్ని పరిశీలించి కొత్త అలంపూర్‌ నిర్మిస్తామని చెప్పడం.. అందుకు అనువుగా దాదాపు 43.27 ఎకరాల భూమిని సేకరించి ప్లాట్లుగా మలిచారు. అయితే, బాధితులకు పట్టాలు పంపిణీ చేసే క్రమంలో అర్హులకు అన్యాయం చేశారంటూ కొందరు ఆందోళనకు దిగడంతో పట్టాల పంపిణీ నిలిపివేశారు. 2023లో ఎన్నికల ముందు కలెక్టర్‌ ఆదేశాలతో వరద బాధితులకు ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకొని విచారించారు. మరోసారి అర్హుల జాబితాను సిద్ధం చేశారు. కానీ, రాజకీయ కారణాలతో పట్టాల పంపిణీ జరగలేదు. ఆ స్థలాలు ఇప్పుడు ముళ్ల పొదలతో నిండాయి. మానవపాడు మండలం మద్దురులోనూ వరద బాధితుల కోసం 32 ఎకరాలను ప్రతిపాదించారు. ఈ సమస్య కొలిక్కిరాలేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనైనా న్యాయం జరుగుతుందో.. లేదో వేచి చూడాలి మరి.

Advertisement
Advertisement