చెట్టును ఢీకొన్న ఆటో | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న ఆటో

Published Tue, Dec 19 2023 12:32 AM

-

త్రుటిలో తప్పిన ప్రమాదం

లింగాల: మండల కేంద్రం, తెల్కపల్లి రోడ్డు మార్గంలో చెట్టును ఆటో ఢీకొన్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం కోమటికుంటకు చెందిన గుగ్గిళ్ల శేషు లింగాల నుంచి గ్రామానికి ఆటోలో వెళ్తున్నాడు. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొన్నది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్వ గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో పాక్షికంగా దెబ్బతిన్నదని తెలిపారు.

Advertisement
Advertisement