ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు ప్రారంభం

Published Thu, Dec 21 2023 1:06 AM

- - Sakshi

జనరల్‌ ఆస్పత్రిలో ప్రత్యేకంగాపది పడకల వార్డు ఏర్పాటు

త్వరలో పీహెచ్‌సీ స్థాయిలోఅనుమానితులకు పరీక్షలకు ఏర్పాట్లు

కేరళ వెళ్లే అయ్యప్పభక్తులు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యాధికారులు

ప్రమాదకరం కాదు..

కోవిడ్‌లో వచ్చిన కొత్త రకం వైరస్‌ తీవ్ర ప్రమాదకరమైనది కాదు. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. జనరల్‌ ఆస్పత్రిలో కావాల్సిన పడకలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరం అయిన డ్రగ్స్‌ కూడా అందుబాటులో ఉంచాం. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు కూడా ప్రారంభించాం. ప్రతి రోజు అనుమానితులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తాం. వాతావరణ మార్పుల కారణంగా కూడా చాలా మందిలో జ్వరం, దగ్గు, జలుబు ఇతర సమస్యలు ఉంటున్నాయి. చలికాలంలో వేడినీళ్లు తాగడం, తాజా ఆహారం తీసుకోవడం, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలి. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్తే తప్పక మాస్క్‌ ధరించాలి.

– డాక్టర్‌ జీవన్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

జాగ్రత్తలు తీసుకోవాలి..

ప్రస్తుతం వస్తున్న కరోనా తీవ్రత కేరళలో అధికంగా ఉన్న క్రమంలో అయ్యప్ప భక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శబరి వెళ్లే స్వాములతో పాటు భక్తులు కూడా మాస్క్‌లు ధరించడం, శానిటేషన్‌ చూసుకోవడం చేయాలి. అక్కడి నుంచి జిల్లాకు వచ్చిన తర్వాత కూడా జ్వరం, దగ్గు, జలుబు ఇతర లక్షణాలు ఏమైనా ఉంటే వైద్యుడి సలహాతో మందులు వాడాలి. అవసరమైతే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసుకోవాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు రాలేదు.

– డాక్టర్‌ కృష్ణ, డీఎంహెచ్‌ఓ

పాలమూరు: ఇతర రాష్ట్రాల్లో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఆరోగ్యశాఖ అధికారులతో పాటు కరోనా చికిత్స అందించే ప్రభుత్వ ఆస్పత్రి అధికారులను అప్రమత్తం చేశారు. ఆరోగ్యశాఖ అధికారులతో పాటు జనరల్‌ ఆస్పత్రి వైద్య అధికారులు ముందస్తుగా సన్నద్ధం అవుతున్నారు. బుధవారం నుంచి జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో అనుమానితులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు ప్రారంభించారు. మొదటి రోజు 15మంది అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరించారు. ముందస్తుగా ఆస్పత్రి అధికారులు కోవిడ్‌ భవనంలో ప్రత్యేకంగా పది పడకలకు వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ ఇతర సదుపాయాలు సిద్ధం చేశారు. ఆర్టీపీసీఆర్‌ చేసుకున్న అనుమానితుల్లో ఎవకై నా పాజిటివ్‌ వస్తే ఈ ప్రత్యేక వార్డులో చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని పీహెచ్‌సీలలో కూడా త్వరలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తామని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

1/1

Advertisement
Advertisement