చట్టాలపై విద్యార్థులుఅవగాహన పెంచుకోవాలి | Sakshi
Sakshi News home page

చట్టాలపై విద్యార్థులుఅవగాహన పెంచుకోవాలి

Published Thu, Dec 21 2023 1:06 AM

- - Sakshi

పాలమూరు: సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులు పరిరక్షించాలని, హక్కులకు భంగం కలగకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి అన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో మాట్లాడారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్‌లో మంచి రంగాల్లో రాణించాలని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ పుట్టపాగ రఘుపతి, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, న్యాయవాదులు సతీష్‌, యోగేశ్వర్‌ రాజ్‌యాదవ్‌, మల్లారెడ్డి, పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ నాగరాజు పాల్గొన్నారు.

చదువుకుంటేనేభవిష్యత్‌: డీఈఓ

అడ్డాకుల: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుంటే ఉజ్వల భవిష్యత్‌ లభిస్తుందని జిల్లా విద్యాధికారి రవీందర్‌ అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం ప్రేరణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు పరీక్షల వరకు కష్టపడి చదవాలని చెప్పారు. ఫిబ్రవరిలో మరోసారి ప్రేరణ తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు. ప్రతి విద్యార్థి లో సామర్థ్యం ఉంటుందని, దాన్ని వెలికి తీయ డమే మన కర్తవ్యంగా భావించాలని సూచించారు. ర్యాంకుల కోసం కాకుండా విషయ పరిజ్ఞానం కోసం చదవాలని చెప్పారు. పరీక్షలో ఉత్తమ ఫలితాల సాధనకు మెళకువలను బోధించారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకు డు శ్రీనివాస్‌, సీఎంఓ బాలుయాదవ్‌, మండల నోడల్‌ అధికారి వి.కురుమూర్తి, హెచ్‌ఎంలు జ్యోతి, ప్రకాష్‌, ఫయాజోద్దిన్‌ పాల్గొన్నారు.

1/1

Advertisement
Advertisement