కాసుల గలగల | Sakshi
Sakshi News home page

కాసుల గలగల

Published Fri, Dec 22 2023 1:18 AM

- - Sakshi

పాలమూరు: ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్స్‌ శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం అధికంగా సమకూరుతుంది. కొంతమేర అన్నిరకాల రిజిస్ట్రేషన్లు తగ్గినా.. ఆదాయం మాత్రం అధికంగానే వస్తోంది. దీనికి తోడు రిజిస్ట్రేషన్‌ ఫీజులు సైతం పెరగడంతో స్టాంపులు– రిజిస్ట్రేషన్‌ శాఖకు కాసుల పంట పండుతోంది. పెరిగిన రిజిస్ట్రేషన్ల ధరలతో ఆదాయం రెట్టింపు అయ్యింది. ఉమ్మడి జిల్లాలోని 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో అత్యధిక ఆదాయం జడ్చర్ల కార్యాలయం నుంచి వచ్చింది. జడ్చర్లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా జరగడంతోపాటు జాతీయ రహదారి, హైదరాబాద్‌కు దగ్గరలో, పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో అక్కడి భూములకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. దీనికితోడు ఏటా క్రయవిక్రయాలు అధికంగానే జరుగుతాయి. అతి తక్కువగా అలంపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో జరిగాయి. జడ్చర్లలో 15,376 రిజిస్ట్రేషన్స్‌ కాగా అలంపూర్‌లో 1,930 మాత్రమే అయ్యాయి.

ఉమ్మడి జిల్లా పరిధిలో..

ఉమ్మడి జిల్లాలోని 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ ఏడాది జనవరి నవంబర్‌ వరకు 92,385 డాక్యుమెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ అయితే వీటి వల్ల ప్రభుత్వానికి రూ.241.53 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా జడ్చర్ల పరిధిలో 15,376 డాక్యుమెంట్స్‌ ద్వారా రూ.57.59 కోట్లు, తక్కువగా అలంపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో 1,930 డాక్యుమెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ అయితే రూ.2.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో స్టాంపు విక్రయాల ద్వారా రూ.181.69 కోట్ల ఆదాయం, బదలాయింపు పన్ను ద్వారా రూ.22.33 కోట్లు, రిజిస్ట్రేషన్‌ సేవల ద్వారా రూ.37.50 కోట్ల ఆదాయం వచ్చింది.

ఏడాదిలో 92,385 డాక్యుమెంట్స్‌రిజిస్ట్రేషన్‌

ప్రభుత్వానికి సమకూరినరూ.241.53 కోట్ల ఆదాయం

అత్యధికంగా జడ్చర్ల, అత్యల్పంగాఅలంపూర్‌లో క్రయవిక్రయాలు

ఉమ్మడి జిల్లాలో

గతేడాది కంటే పెరిగిన రిజిస్ట్రేషన్లు

మహబూబ్‌నగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం
1/1

మహబూబ్‌నగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

Advertisement
Advertisement