భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనం | Sakshi
Sakshi News home page

భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనం

Published Sat, Dec 23 2023 12:42 AM

విద్యుద్దీపాల్లో మెరిసిపోతున్న శ్రీలక్ష్మినరసింహస్వామి దేవాలయం  - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ‘వైకుంఠ ఏకాదశి’ పర్వదినం సందర్భంగా జిల్లావ్యాప్తంగా శనివారం వైష్ణవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. కాటన్‌మిల్లు వేంకటేశ్వరస్వామి దేవాలయంలో తెల్లవారుఝామున నుంచి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. సహస్ర నామార్చన, పుష్పార్చనలు నిర్వహించనున్నారు. బ్రాహ్మణవాడి శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో పల్లకీసేవ అనంతరం ఉత్తరద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. శ్రీనివాస కాలనీ పంచముఖాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం, సాయంత్రం విష్ణు సహస్ర నామ పారాయణాలు నిర్వహించనున్నారు. సింహగిరి లక్ష్మీనసింహ్మస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించనున్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగాఆలయాల్లో ఏర్పాట్లు

Advertisement
Advertisement