వి‘నూతన’ వేడుకలు | Sakshi
Sakshi News home page

వి‘నూతన’ వేడుకలు

Published Mon, Jan 1 2024 1:00 AM

- - Sakshi

ఒక్కో దేశంలో ఒక్కో విధంగా నూతన సంవత్సర సంబరాలు ఆహారం నుంచి ఆధ్యాత్మికత వరకు విభిన్న సంప్రదాయాలు, ఆచారాలు

సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరం వచ్చిందంటే.. ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. పాత ఏడాది ఇచ్చిన చేదు అనుభవాలను మరిచిపో యి.. తీపి జ్ఞాపకాలను గుర్తు పెట్టుకొని సరికొత్త ఆకాంక్షల తో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకు తారు. అయితే ఈ వేడుకలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుగుతుంటాయి. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబిస్తా యి. ప్రపంచమంతా క్రమంగా 2023కు వీడ్కోలు పలుకుతూ.. 2024కు స్వాగతం పలికిన తరుణంలో.. వివిధ దేశాల ప్రజలు జరుపుకునే వేడుకలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు..

● డెన్మార్క్‌లో ప్రజలు తమ ఇళ్లలోని పింగాణీ పాత్రలను గది తలుపులపై విసిరేస్తారు. అవి పగిలి.. ఎన్ని ముక్కలైతే కొత్త ఏడాది అంత అదృష్టం కలిసొస్తుందని వారి నమ్మకం.

● గ్రీస్‌ ప్రజలు ‘వాసిలోపిటా’ అనే కేక్‌లో ఒక నాణాన్ని కనిపించకుండా పెడతారు. ఎవరికై తే ఆ నాణెం ఉన్న కేక్‌ భాగం వస్తుందో.. వారికి ఆ ఏడాదంతా అదృష్టం కలిసి వస్తుందని విశ్వసిస్తారు.

● నూతన సంవత్సరం అంటేనే పాతకు వీడ్కోలు చెప్పడం. దీనికి సూచికగా దక్షిణాఫ్రికా ప్రజలు డిసెంబర్‌ 31వ తేదీ అర్ధరాత్రి పాత వస్తువుల ను కిటికీల నుంచి బయటకు విసిరేస్తారు.

● స్కాట్లాండ్‌లో అర్ధరాత్రి దాటాక తమ ఇంట్లోకి మొదటగా ఎవరు అడుగు పెడతారో.. వారి వల్ల అదృష్టం వస్తుందని విశ్వసిస్తూ బహు మతులు ఇచ్చుకుంటారు.

● స్పెయిన్‌లో డిసెంబర్‌ 31వ తేదీ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు కాగానే.. 12 ద్రాక్ష పండ్లు తినడం సంప్రదాయం. ఒక్కో పండు ఒక్కో నెలకు సంకేతం. ఇలా తినటం వల్ల అదృష్టం లభిస్తుందని నమ్ముతారు.

● జపాన్‌లో ప్రజలు అర్ధరాత్రి వేళ బౌద్ధ దేవాల యాలకు వెళ్లి 108 సార్లు గంటలు మోగిస్తారు.

● బ్రెజిల్‌లో జనం తెలుపు రంగు దుస్తులు ధరించి సముద్ర దేవత యెమాంజకు నైవేద్యంగా సముద్రంలోకి పువ్వులను విసిరి పాటలు పాడుతారు.

● ఫిలిప్పీన్స్‌లో గుండ్రని ఆకారంలో ఉన్న వస్తువు లు, దుస్తులు అదృష్టం తెచ్చిపెడతాయని విశ్వ సిస్తారు. అందువల్ల అక్కడి వారు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ గుండ్రని చుక్కలు ఉన్న దుస్తులు ధరిస్తారు. ఆ రోజు గుండ్రని పండ్లు తింటారు.

● రష్యాలో కాగితంపై న్యూ ఇయర్‌ విషెస్‌ రాసి దానిని కాల్చి ఆ పొడిని అర్ధరాత్రి షాంపైన్లో కలుపుకొని తాగుతారు.

● అమెరికాలోని న్యూయార్క్‌లో అర్ధరాత్రి 12 గంటలకు టైమ్‌ బాల్‌ను కిందకు వదులుతారు. దీన్ని ‘బాల్‌ డ్రాప్‌’ అంటారు. అలా వారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది.

చైనాలో జరుపుకోరు..

జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించుకోని దేశాలుకూడా ఉన్నాయి. చైనాతోపాటు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌, వియత్నాం దేశాలు న్యూ ఇ యర్‌ వేడుకలను జరుపుకోవు. వారి క్యాలెండర్‌ ప్ర కారమే అక్కడ కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకుంటారు. చైనా ప్రజలు ఫిబ్రవరి నెలలో నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటారు.

1/1

Advertisement
Advertisement