అయితే మీరూ జాగ్రత్త! | Sakshi
Sakshi News home page

అయితే మీరూ జాగ్రత్త!

Published Mon, Jan 1 2024 1:00 AM

- - Sakshi

మీ భాగస్వామికి

బీపీ ఉందా..

సాక్షి, అమరావతి: అధిక రక్తపోటు(హైబీపీ).. ప్రస్తు తం యువత సైతం ఈ సమస్యను ఎదుర్కొంటోంది. అంతేకాదు భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఈ సమ స్య ఉన్నా రెండో వ్యక్తికి వచ్చే అవకాశాలు మెండు గా ఉన్నాయని ప్రముఖ విశ్వవిద్యాలయాలు చేసిన అధ్యయనంలో తేలింది. మన దేశంలో 50 ఏళ్లు పైబడిన 20 శాతం దంపతుల్లో ఇద్దరు హైబీపీతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. హైబీపీ లేని వారిని పెళ్లి చేసుకున్న మహిళలతో పోలిస్తే.. సమస్య ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్న ట్లు తేలింది. ఇంగ్లాండ్‌, అమెరికా, చైనా దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈ మేరకు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది.

ఇవీ సర్వేలో గుర్తించిన కీలక అంశాలు

● మిచిగాన్‌, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యా లయాలు 2015–19 మధ్య ఒక అధ్యయనం చేపట్టాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్‌లో 1,086, యూఎస్‌ఏలో 3,989, చైనాలో 6,514, భారత్‌లో 22,389 జంటల ఆరోగ్యాన్ని పరిశోధ కులు విశ్లేషించారు. వీరంతా యూఎస్‌ఏ, ఇంగ్లాండ్‌ దేశాల్లో 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ, చైనా, భారత్‌లో 45 ఏళ్లు, ఆ పైబడిన వయసు వారే ఉన్నారు.

● ఇంగ్లాండ్‌లో 47.1శాతం, యూఎస్‌లో 37.9 శాతం, చైనాలో 20.8శాతం, భారత్‌లో 19.8 శాతం జంటలు (భార్యాభర్తలు) హైబీపీతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

● చైనా, భారత్‌ దేశాల్లో దంపతుల్లో ఏ ఒక్కరికి సమస్య ఉన్నా రెండోవారు కూడా దాని బారినపడే పరిస్థితి బలంగా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు.

● హైబీపీ లేని వ్యక్తులను పెళ్లి చేసుకున్న మహిళల తో పోలిస్తే.. సమస్య ఉన్నవారిని వివాహం చేసు కున్న మహిళలు హైబీపీ బారినపడటానికి అమె రికా, ఇంగ్లాండ్‌ దేశాల్లో 9శాతం ఎక్కువ అవకా శం ఉందని నిర్ధారించారు. చైనాలో అయితే ఏకంగా 26శాతం ఉన్నట్టు వెల్లడించారు.

● పురుషుల విషయంలోనూ ఇలాగే జరుగుతుండటం గమనార్హమని పరిశోధకులు తెలిపారు.

● భార్యాభర్తల మధ్య భావోద్వేగ బంధాలు, ఇష్టా యిష్టాలు, ఒకరిపై మరొకరు ఆధారపడటం, జీవ నశైలి, ఇతర అంశాలు ఆరోగ్యం మీద పరస్పర ప్రభావాన్ని చూపుతున్నట్లు అంచనా వేశారు.

దంపతుల్లో ఒకరికి రక్తపోటు ఉంటే మరొకరిపైనా దాని ప్రభావం

భారత్‌లో 50 ఏళ్లు పైబడిన వారిలో 20శాతం దంపతుల్లో అధిక రక్తపోటు సమస్య

అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనంలో వెల్లడి

దేశంలో 22వేల జంటలపై అధ్యయనం

ఇంగ్లాండ్‌, యూఎస్‌, చైనా దేశాల్లోనూ అధ్యయనం

Advertisement
Advertisement