మహిళ మృతిపై వీడని మిస్టరీ | Sakshi
Sakshi News home page

మహిళ మృతిపై వీడని మిస్టరీ

Published Mon, Jan 15 2024 12:44 AM

-

బల్మూర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలంలోని పోలేపల్లి శివారులో శనివారం రాత్రి గుర్తించిన గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. అచ్చంపేట సీఐ అనుదీప్‌ ఆదివారం వివరాలు వెల్లడించారు. ఉప్పనుంతల మండల కేంద్రానికి చెందిన బాలకిష్టమ్మ(45) ఈ నెల 12న శుక్రవారం పండుగ సరుకుల కోసమని అచ్చంపేటకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పింది. కానీ రాత్రి అయినా కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు బంధువుల ఇంటికి వెళ్లి ఉండొచ్చని భావించారు. శనివారం రాత్రి బల్మూర్‌ మండలంలోని పోలేపల్లి శివారులో అనుమానాస్పదస్థిఽతిలో ఆమె మృతి చెందింది. బాటసారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు చేసుకుని మృతదేహన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సామాజిక మాధ్యమాల్లో మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులను ఆశ్రయించగా అమె వివరాలు తెలిశాయి. మృతురాలు అచ్చంపేటకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పినా అక్కడికి వెళ్లకుండా ఉప్పనుంతల– బల్మూర్‌ మండలాల సరిహద్దుల్లోని పోలేపల్లి శివారుకి ఎందుకొచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నోటి నుంచి నురగతో పాటు గొంతుపై కమిలిన గాయం ఉండటంపై ఇది హత్యగానే అనుమానాలు వ్యక్తం అవుతాయి. మృతురాలి కుమారుడు సాయికుమార్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పోస్టుమార్టం నివేధిక ఆధారంగా విచారణ చేపట్టి నిందితులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఉప్పునుంతలకు చెందిన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలితో పాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరు మహిళలు కల్లుకు బానిసలై రోజుల తరబడి ఇతర గ్రామాలకు వెళ్తుంటారని గ్రామస్తులు తెలిపారు.

మృతురాలిది ఉప్పునుంతలగా గుర్తింపు

Advertisement
Advertisement