గ్రూపు 4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

గ్రూపు 4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Published Tue, Jun 27 2023 12:24 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సంతోష్‌  - Sakshi

నస్పూర్‌: గ్రూపు 4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ అన్నారు. సోమవారం ఆయన నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్‌ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాహుల్‌, ట్రెయినీ కలెక్టర్‌ పి.గౌతమి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు వేణు, శ్యామలాదేవి, జిల్లా పంచాయితీ అధికారి వెంకటేశ్వర్‌రావులతో కలిసి గ్రూప్‌ 4 పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడతూ జిల్లాలో 94 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 27,801 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
నస్పూర్‌:
జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సంతోష్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీస్‌, ఆబ్కారీ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య పాల్గొన్నారు.

సికెల్‌ సెల్‌ నియంత్రణకు..
జిల్లాలో సికెల్‌ సెల్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ సంతోష్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుబ్బరాయుడుతో కలిసి సికెల్‌ సెల్‌ నిర్వహణ పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని కాసిపేట, మందమర్రి, దండేపల్లి, తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిఽధిలో 18,436 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతీ ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు బృందాలు ఏర్పాటు చేసి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా ఆరోగ్య శాఖ ఉపవైద్యాధికారి డాక్టర్‌ ఫయాజ్‌, మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement