● నెల రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ● తాజా వానలతో పంటలకు ప్రాణం.. రైతుల మోములో ఆనందం ● పంటలకు మేలంటున్న వ్యవసాయాధికారులు | Sakshi
Sakshi News home page

● నెల రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ● తాజా వానలతో పంటలకు ప్రాణం.. రైతుల మోములో ఆనందం ● పంటలకు మేలంటున్న వ్యవసాయాధికారులు

Published Mon, Sep 4 2023 12:34 AM

టేకుమట్ల వద్ద క్యాజ్‌వే పై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు - Sakshi

జన్నారంలో భారీ వర్షం

జన్నారం: మండలంలో మోస్తరు వర్షం కురి సింది. ఆదివారం మధ్యాహ్నం గంటపాటు కురిసిన భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. అంతర్గత రోడ్లు బురదమయమయ్యాయి. కొత్తపేట గ్రామ పంచాయతీ పరి ధిలోని బక్కుగూడకు చెందిన ఆత్రం అర్జు, టేకం కట్టి, టేకం రాజు, సిడాం మారుకు చెందిన మొక్కజొన్న పంటలు నేలవాలాయి.

మండలాల వారీగా

నమోదైన వర్షపాతం

మండలం వర్షం(మి.మీలలో)

జైపూర్‌ 82.6

చెన్నూర్‌ 80.4

భీమారం 61.5

వేమనపల్లి 52.3

లక్సెట్టిపేట 46.5

కోటపల్లి 45.2

జన్నారం 42.5

నస్పూర్‌ 40

మందమర్రి 35.8

తాండూర్‌ 34.8

హాజీపూర్‌ 30.4

దండేపల్లి 27.5

భీమిని 24.8

బెల్లంపల్లి 24.3

నెన్నెల 22.8

కాసిపేట 22

మంచిర్యాల 21.8

కన్నెపల్లి 8.5

హాజీపూర్‌లో వర్ష బీభత్సం

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌ మండలం ముల్కల్ల, గుడిపేట గ్రామాల్లో ఆదివారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. ముల్కల్లకు చెందిన గుండు శ్రీనివాస్‌ ఇంటి పైకప్పు కొట్టుకుపోవడంతో నిరాశ్రయులయ్యారు. గుడిపేట జాతీ య రహదారికి ఇరువైపుల ఉన్న పలు చెట్లు కూ లిపోయాయి. రోడ్డుకు అడ్డుగా వృక్షాలు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హాజీపూర్‌ ఎస్సై నరేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో చెట్ల కొమ్మలు తొలగించి వేయించారు.

మంచిర్యాలఅగ్రికల్చర్‌/నెన్నెల: దాదాపు నెల రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు ఎండిపోయే దశకు చేరుకుంటున్న పంటలకు ప్రాణం పోశాయి. శనివారం నుంచి ఆదివారం వరకు జిల్లాలో సగటున 9.5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి జిల్లా అంతటా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 323.1 మిల్లీమీటర్లు కురువాల్సి ఉండగా కేవలం 108.4 మిల్లిమీటర్లు మాత్రమే కురిసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పత్తి, కంది, మొక్కజొన్న, వరి పంటలకు నీటి తడులు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి.

సాధారణం కన్నా తక్కువ..

జిల్లాలో జూలైలో సాధారణం కన్నా రెండు రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు జిల్లాలో 790.7 మిల్లిమీటర్లు సాధారణ వర్షపాతం నమోదుకావాలి. ఇప్పటి వరకు 754 మిల్లిమీటర్లు కురిసింది. 5 శాతం లోటు నెలకొంది. తాండూర్‌, భీమిని, కన్నెపెల్లి, వేమనపల్లి, నెన్నెల మండలాల్లో 20 నుంచి 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 13 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది.

చెన్నూర్‌ నియోజకవర్గంలో భారీ వర్షం..

జైపూర్‌/భీమారం/కోటపల్లి: చెన్నూర్‌ నియోజకవర్గం పరిధిలోని జైపూర్‌, భీమారం, కోటపల్లి మండలాల్లో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. భీమారం మండలం మంచిర్యాల– చెన్నూరు జాతీయరహదారి నుంచి వెళ్లే జోడువాగులు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరదకు కోటపల్లి మండలం నక్కలపల్లి బమన్‌పల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన తెగిపోయింది. పార్‌పల్లి, లింగన్నపేట కల్వర్టు వద్ద వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. జైపూర్‌ మండలం రసూల్‌పల్లి, ముదిగుంట, మిట్టపల్లి, కాన్కూర్‌, రామారావుపేట, ఇందారం, టేకుమట్ల, పెగడపల్లి, గంగిపల్లి, షెట్‌పల్లి, కుందారం, కిష్టాపూర్‌, వేలాల, పౌనూర్‌, శివ్వారం గ్రామాల్లో కుండపోత వర్షం కురిసింది. మండల వ్యాప్తంగా అత్యధికంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు 83.8మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పెగడపల్లి ఈదులాగు, టేకుమట్ల పెద్దవాగు ఉప్పొంగి ప్రవహించాయి. లోలెవల్‌ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల–చెన్నూర్‌ 63వ నంబర్‌ జాతీయ రహదారిలోని రసూల్‌పల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై చేరింది. చెన్నూర్‌ పట్టణానికి చెందిన తిరుపతిరెడ్డి కారు రసూల్‌పల్లి వద్ద వర్షానికి రోడ్డు పకన్న వేగంగా కరెంట్‌ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టి సమీపంగా ఉన్న జాతి తిరుపతి ఇంట్లోకి దూసుకపోయింది. దీంతో విద్యుత్‌ స్తంభం విరిగిపోయింది. జాడి తిరుపతి ఇళ్లు ధ్వసమైంది. కారు ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్‌ కావడంతో స్వల్పగాయాలతో ఆయన బయటపడ్డాడు. రసూల్‌పల్లి పెద్దవాగు ఉధృతంగా ప్రవహించింది. రోడ్లు, పంట పొలాలు నీటమునిగాయి.

బక్కుగూడలో నేలకొరిగిన మొక్కజొన్న పంట
1/2

బక్కుగూడలో నేలకొరిగిన మొక్కజొన్న పంట

ముల్కల్లలో గాలివానకు పైకప్పు లేచిపోయిన ఇంటి ఎదుట గుండు శ్రీనివాస్‌ కుటుంబం
2/2

ముల్కల్లలో గాలివానకు పైకప్పు లేచిపోయిన ఇంటి ఎదుట గుండు శ్రీనివాస్‌ కుటుంబం

Advertisement
Advertisement