అధికారుల మెడకు ఉచ్చు | Sakshi
Sakshi News home page

అధికారుల మెడకు ఉచ్చు

Published Fri, Nov 24 2023 11:52 PM

-

అంకెలు దిద్దిన

బెల్లంపల్లి: నియోజకవర్గ ఎన్నికల ప్రచార లెక్కల్లో అవకతవకలకు పాల్పడిన మున్సిపల్‌ అధి కారులపై క్రమంగా ఉచ్చు బిగుస్తోంది. మున్సి పల్‌ రశీదుపై అంకెలు దిద్ది అక్రమాలకు పాల్ప డిన కమిషనర్‌పై కొందరు రాష్ట్ర ఎన్నికల కమి షన్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఇటీవల చేసిన ఫిర్యాదు మేరకు గురువారం బెల్లంపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అధికారులు ఫిర్యాదుదా రులతో ప్రత్యేకంగా మాట్లాడి తగిన ఆధారాలు సేకరించారు. ప్రచార అనుమతి కోసం కాంగ్రెస్‌ నుంచి రూ.15 వేలు తీసుకుని మున్సిపల్‌ అధి కారులు ఇచ్చిన అంతర్గత రశీదుపై ఓ అంకెను చె రిపేసి ఏకంగా పచ్చ ఇంకుతో కమిషనర్‌ రూ. 10వేలు మాత్రమే రాసి సంతకం చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అక్రమ వ్యవహారం బయట పడగా కొందరు సంబంధిత ఉ న్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు విచారణ చేపట్టారు. విచారణ నివేదిక రెండురోజుల వ్యవధిలో ఉన్నతాధికారులకు అందజేస్తామని ఫిర్యాదుదారుకు అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకోవడం తథ్యమనే ప్రచారం జరుగుతోంది. కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ముందస్తుగా జిల్లా, బెల్లంపల్లి ఎన్నికల అధి కారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ రోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు ఫిర్యాదుదారులు ఆరోపించారు. తప్పు చేసిన అధికారిని కాపాడటానికే ఆ తీరుగా వ్యవహరించి ఉంటారని చర్చించుకుంటున్నారు.

విచారణ చేపట్టిన అధికారులు

సాక్ష్యాలు ఇచ్చిన ఫిర్యాదుదారు

కర్త, కర్మ, క్రియ అంతా ఆయనే..!

అంకెల లెక్కల తప్పుడు వ్యవహారంలో మున్సిపల్‌ కమిషనర్‌ అడ్డంగా బుక్కయ్యారు. అన్నీ తెలిసీ కమిషనర్‌ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అవసరం ఉండగా తప్పుడు పద్ధతి పాటించి ఆ తప్పిదాన్ని నెత్తిన వేసుకోవాలని ఒకరిద్దరు సిబ్బందిపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లు మున్సిపల్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, చేయని నేరాన్ని తామెలా నెత్తిన వేసుకుంటామని సిబ్బంది బాహాటంగానే చెబుతున్నారు. కమిషనర్‌ తమకన్నా ఉన్నతాధికారి కావడంతో ఏ చిన్న తప్పు దొర్లినా టార్గెట్‌ చేస్తారేమోనని భయపడుతున్నారు.

Advertisement
Advertisement