ఓటు సామాన్యుడి వజ్రాయుధం | Sakshi
Sakshi News home page

ఓటు సామాన్యుడి వజ్రాయుధం

Published Fri, Nov 24 2023 11:52 PM

- - Sakshi

● ఓటు సామాన్యుడి వజ్రాయుధం ● సమర్థవంతులకే ఓటేసుకుందాం ● మంచి సర్కార్‌ను తెచ్చుకుందాం ● సాక్షి ‘ప్రజాఎజెండా’లో మహిళలు

బాధ్యతగా ఓటేయాలి

ఓటు వినియోగించుకోకపోతే మనం బాధ్యతారహితంగా ఉన్నట్టు. సమాజ అభివృద్ధిని కాంక్షించే వారిని, సమాజంలో మార్పు తెచ్చేవారికి ఓటేయాలి. మహిళలపై దాడులు చేసేవారికి వెంటనే కఠిన శిక్షలు అమలు చేసేలా చూసే నాయకులకు ఓటేయాలి. మహిళాభ్యుదయానికి పాల్పడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.

– జ్యోత్స్న చంద్రదత్‌,

ఇంపాక్ట్‌ స్పీకర్‌, మంచిర్యాల

ప్రశ్నించే హక్కు కోల్పోవద్దు

మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, అన్ని రంగాల్లో ముందుంటారని నిరూపించుమనం కోవాలి. లింగవివక్ష లేకుండా పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించే వారికి ఓటేయాలి. మహిళా చట్టాలను గౌరవించేవారిని ఎన్నుకోవాలి. ప్రతీ మహిళ ఓటేసి పాలకులను ప్రశ్నించే హక్కును కాపాడుకోవాలి.

– కె.ఉషశ్విని,

వనితావాక్కు జిల్లా ఉపాధ్యక్షురాలు

1/1

Advertisement
Advertisement