మధుర ఫలం.. మస్తు పిరం! | Sakshi
Sakshi News home page

మధుర ఫలం.. మస్తు పిరం!

Published Mon, Apr 8 2024 1:10 AM

చెన్నూర్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న మామిడి
 - Sakshi

● కిలో రూ.200లకు పైనే.. ● రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం

చెన్నూర్‌: పండ్లలోనే రారాజుగా పిలిచే మధుర ఫలం(మామిడి) ధరలు మండుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో మామిడి ధర రూ.150 నుంచి రూ.200 పలుకుతోంది. మామిడి పండ్ల ధరలే ఇలా ఉంటే పచ్చడి కాయ ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా మామిడి కాత నిరాశజనకంగా ఉంది. జిల్లాలో 18,170 ఎకరాలలో మామిడి తోటలు విస్తరించి ఉండగా కాత అంతంత మాత్రంగానే ఉంది. దీంతో రానున్న రోజుల్లో మామిడి పండ్లు, పచ్చడి కాయల ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఉగాది తర్వత పచ్చళ్లు..

మామిడి పచ్చళ్లను ఉగాది పండగ తర్వత పెట్టుకోవడం అనవాయితీగా వస్తుంది. ఉగాది తర్వాత పెట్టుకునే పచ్చళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని నమ్మకం. దీంతో పండుగ తర్వాత ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

ఎగుమతి అంతంతే..

జిల్లాలోని మామిడికి వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. జిల్లా నుంచి ఏటా సుమారు పది వేల టన్నులకుపైగా మామిడి ఎగుమతి అవుతుంది. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉండడంతో ఎగుమతి అంతంత మాత్రంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కాయ తక్కువ కాయడంతో ఇక్కడే ధరలు ఎక్కువగా ఉండడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే భారం తప్పిందని రైతులు చెబుతున్నారు.

Advertisement
Advertisement