హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యవర్గం | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యవర్గం

Published Mon, Apr 8 2024 1:10 AM

శ్రీధర్‌ని సన్మానిస్తున్న సభ్యులు.
 - Sakshi

నస్పూర్‌: హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని నస్పూర్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పెంచాల శ్రీధర్‌, కార్యదర్శిగా తూండ్ల శ్రీనివాస్‌, కోశాధికారిగా తూర్పాటి వెంకటేశ్‌, పలువురిని సభ్యులుగా ఎంపిక చేశారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. ఎన్నికల అబ్జర్వర్లుగా అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.విష్ణువర్ధన్‌, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా సభ్యుడు మారయ్య, జిల్లా అథ్లెటిక్‌ కార్యదర్శి, కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి రాంచందర్‌ వ్యవహరించారు. కార్యక్రమంలో గడ్డం సాయికుమార్‌, శీలం సాయికుమార్‌, నరేశ్‌, ప్రేంసాయి, కౌశిక్‌, మహేశ్‌, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement