Gold Demand : ఆషాఢంలో ఆఫర్లు హోరెత్తుతాయా ?

13 Jun, 2021 12:10 IST|Sakshi

బంగారం ధరపై ఆఫర్లు ప్రకటిస్తున్న డీలర్లు

రిటైల్‌ మార్కెట్‌లో ఆఫర్ల  ట్రెండ్‌ వచ్చేనా ? 

ముంబై: త్వరలో బంగాంరం ధరలు తగ్గుతాయా ? కష్టమర్లను ఆకట్టుకునేందుకు జ్యూయల్లరీ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తాయా అంటే అవుననే అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. బంగారానికి తిరిగి డిమాండ్‌ తీసుకువచ్చేందుకు ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

పడిపోయిన డిమాండ్‌
కరోనా సెకండ్‌ వేవ్‌తో బంగారం ధరలు పడిపోయాయి. కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ల మధ్య కాలంలో అంటే 2020 నవంబరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,960గా ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740లుగా ఉంది. దాదాపుగా నాలుగు వేల వరకు బంగారం ధర పడిపోయింది. స్వచ్ఛమైన బంగారం ధరల్లోనూ ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌లో కరోనా పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు కనిష్టంగా కేవలం 12 టన్నుల బంగారం దిగుమతి చేసుకోగా గత మేలో అంతకంటే తక్కువ బంగారం దిగుమతి అయ్యింది. దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు తగ్గిపోయాయి. 

హోల్‌సేల్‌ ఆఫర్లు
ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి సడలింపులు మొదలయ్యాయి. దీంతో బంగారం మార్కెట్లో చలనం తెచ్చేందుకు దిగుమతి సుంకం, స్థానిక పన్నులు కలుపకుని ఒక ఔన​‍్సు బంగారంపై దాదాపు 800 నుంచి 900ల వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు. ఫస్ట్‌ ముగింపు దశలో గత సెప్టెంబరులో బంగారం అమ్మకాలు పెంచేందుకు ఈ స్థాయిలో డిస్కౌంట్లు ఇచ్చారు. మరోసారి అదే పద్దతిని బంగారం డీలర్లు అనుసరిస్తున్నారు. 

కొనుగోళ్లు ఉంటాయా
లాక్‌డౌన్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత బంగారం కొనుగోళ్లు ఎలా ఉంటాయనే దానిపై నగల వర్తకుల్లో అనేక సంశయాలు ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లపై వారు తర్జనభర్జనలు పడుతున్నారు. అందువల్లే డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తోందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. చైనా, జపాన్‌, సింగపూర్‌లలో కూడా ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. 

ఆషాఢం ఆఫర్లు 
హోల్‌సెల్‌ డీలర్లు ప్రకటిస్తున్న ఆఫర్లు రిటైర్లరు కూడా ప్రకటిస్తే బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రాబోయే ఆషాఢం మాసం ఎలాగు ఆఫర్లు ప్రకటించేందుకు అనువైనదే. 

చదవండి : బంగారం రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?

Read latest Market News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు