హోం మంత్రి మహమూద్‌ అలీ వాహనం తనిఖీ | Sakshi
Sakshi News home page

హోం మంత్రి మహమూద్‌ అలీ వాహనం తనిఖీ

Published Mon, Nov 6 2023 4:42 AM

బీ ఫామ్‌ అందుకుంటున్న నర్సింహులు  - Sakshi

మనోహరాబాద్‌(తూప్రాన్‌): హోం మంత్రి మహమూద్‌ అలీ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ప్రచారానికి వెళ్తున్న హోం మంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ బీబీ పాటిల్‌ వాహనాలను ఆదివారం మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ శివారులోని చెక్‌ పోస్ట్‌ వద్ద పోలీసులు చెక్‌ చేసి చేశారు.

కష్టాలు తీరాలంటే గెలిపించండి

కాంగ్రెస్‌ మెదక్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు

చిన్నశంకరంపేట(మెదక్‌): ప్రజల కష్టాలు తీరా లంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని పార్టీ మెదక్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు కోరారు. ఆదివారం చిన్నశంకరంపేట మండలం ఖాజాపూ ర్‌, కుమ్మరిపల్లి, రామాయపల్లి, శాలిపేట, చెన్నాయిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌కు బుద్ధిచెప్పాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకు లు శ్రీమన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రాజిరెడ్డి, గంగా నరేందర్‌, రంగారావు, యాదవరావు, భిక్షపతి, అంబాదాస్‌, సిద్దిరాములు పాల్గొన్నారు.

బీఎస్పీ నర్సాపూర్‌

అభ్యర్థిగా నర్సింహులు

నర్సాపూర్‌ : బీఎస్పీ నర్సాపూర్‌ అభ్యర్థిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కుతాడి నర్సింహులును పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు దయానంద్‌, ప్రచార కమిటీ చైర్మన్‌ విజయ్‌ ఆర్యా బీఫామ్‌ సైతం అందజేశారు. నర్సింహులు కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లి గ్రామంలో జన్మించారు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రు ప్రభు త్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఎల్‌ఈఈ చదివారు. ఎయిర్‌ ఇండియాలో సర్వీస్‌ మేనేజర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. 2022లో బీఎస్పీలో చేరి నర్సాపూర్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా పని చేశారు. 2023 నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

బగలాముఖీ ఆలయంలో డీఎస్పీ పూజలు

శివ్వంపేట(నర్సాపూర్‌) : మండల కేంద్రమైన శివ్వంపేటలో కొలువైన బగలాముఖీ అమ్మవారిని ఆదివారం తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా శివ్వంపేట బగలాముఖీ శక్తిపీఠం నిర్మించడం గొప్ప విషయమన్నారు.

రాజకీయ కూలీలు!

ప్రచారానికి రోజుకు రూ.300 నుంచి రూ.500

బతుకమ్మ, బోనమెత్తితే అదనపు భత్యం

మెదక్‌: ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. అభ్యర్థి గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్లిన్నప్పుడు ఓటర్లు కనిపించాలంటూ కూలి ఇచ్చి మరీ ప్రచారానికి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. ఓటర్లే రాజకీయ కూలీలుగా అవతారం ఎత్తడంతో పల్లెలన్నీ ప్రచారాలతో మారు మోగిపోతున్నాయి. ఒక్కో మహిళకు రోజుకు రూ. 300 నుంచి రూ.500 వరకు కూలి ఇస్తున్నట్లు సమాచారం. మగవారికి రోజుకు రూ.500 కూలితోపాటు మందు ఇస్తున్నట్లు పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. అంతే కాకుండా ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం చికెన్‌, మటన్‌లతో భోజనం పెడుతున్నారు. బతుకమ్మలతోపాటు బోనం ఎత్తిన మహిళా కూలీలకు అదనంగా డబ్బు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ రాజకీయ కూలీలు ఏ పార్టీకై నా ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మాట్లాడుతున్న రోహిత్‌రావు
1/2

మాట్లాడుతున్న రోహిత్‌రావు

హోం మంత్రి వాహనాన్ని 
తనిఖీ చేస్తున్న పోలీసులు
2/2

హోం మంత్రి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు

Advertisement
Advertisement