భర్త గెలుపు కోసం ప్రచారం | Sakshi
Sakshi News home page

భర్త గెలుపు కోసం ప్రచారం

Published Thu, Nov 16 2023 7:08 AM

నూతన సభ్యులతో ప్రమాణం 
చేయిస్తున్న ప్రణీద్‌కుమార్‌  - Sakshi

కొల్చారం(నర్సాపూర్‌): నర్సాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆవుల రాజారెడ్డికి ఓటు వేయాలంటూ అతడి భార్య శైలజ రెడ్డి, తనయుడు రుత్విక్‌ రెడ్డి బుధవారం కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. ఓ హోటల్‌ వద్దకు వెళ్లి ధరల గుది బండ నుంచి బయట పడాలంటే కాంగ్రెస్‌కు ఓటువేసి అధికారంలోకి తీసుకురావాలని హోటల్‌ యజమానిని కోరారు.

ఉపాధ్యాయుల సమస్యలపై

ఆందోళన

ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రణీద్‌కుమార్‌

(రామాయంపేట) మెదక్‌: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తామని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మెంగర్తి ప్రణీద్‌కుమార్‌ హెచ్చరించారు. బుధవారం రామాయంపేటలో జరిగిన సంఘం జోనల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా ఇంద్రసేనాచారి, ప్రధాన కార్యదర్శిగా మద్ది శేఖర్‌, కోశాధికారిగా వెంకట్‌రెడ్డి ఎన్నికయ్యారు. జిల్లా కౌన్సిలర్లుగా ఐరేని రవీందర్‌గౌడ్‌, నాగేందర్‌, అబ్దుల్‌ రశీద్‌, శివ, రాజయ్య, రమేశ్‌, హరిప్రసాద్‌, పల్లంరాజు, నరసింహారావు, మహేశ్‌ను ప్రతిపాదించారు. నూతన కమిటీతో సంఘం ప్రతినిధులు ప్రమాణస్వీకారం చేయించారు. జిల్లా కార్యదర్శి రాజగోపాల్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఈటలకే మద్దతు

రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు మల్లేశ్‌

మనోహరాబాద్‌(తూప్రాన్‌): గ్రామాలలో ఓటర్లు ఈటలకే మద్దతు తెలుపుతున్నారని రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్‌ అన్నారు. బుధవారం మనోహరాబాద్‌ మండలం లింగారెడ్డిపేట్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు కమ్మరి నరేందర్‌చారి, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. గజ్వేల్‌లో ఈటల విజం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేశ్‌గౌడ్‌, రితేశ్‌, విజయ్‌, నాగరాజు, రచ్చ శ్రీకాంత్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సురేందర్‌రెడ్డి, పిట్ల వెంకటేశ్‌, బాలకృష్ణ, సత్యనారాయణ, గ్రామ అధ్యక్షుడు వెంకట్‌చారి తదితరులున్నారు.

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి

ఖోఖో పోటీలు

ప్రారంభించిన ఆర్డీఓ జయచంద్రారెడ్డి

తూప్రాన్‌: సెయింట్‌ ఆర్నాల్డ్‌ స్కూల్లో బుధవారం 33వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రారంభించారు. ఉమ్మ డి 10 జిల్లాల నుంచి అండర్‌–14 విభాగంలో సుమారు 300 మంది పాల్గొంటారు. 15 నుంచి 17 వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. మొదటి రోజు నిజామాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు. జిల్లా యువజన క్రీడాధి కారి నాగరాజు, ఖోఖో అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి నీలం, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సీనియర్‌ ఖోఖో వరంగల్‌ కార్యదర్శి శ్యాంసుందర్‌, సదానందం, శ్రీకాంత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

పోటీలను ప్రారంభిస్తున్న ఆర్డీఓ
1/3

పోటీలను ప్రారంభిస్తున్న ఆర్డీఓ

ప్రచారం చేస్తున్న రాజిరెడ్డి సతీమణి, తనయుడు
2/3

ప్రచారం చేస్తున్న రాజిరెడ్డి సతీమణి, తనయుడు

ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు
3/3

ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

Advertisement
Advertisement