వందశాతం పోలింగ్‌ లక్ష్యం | Sakshi
Sakshi News home page

వందశాతం పోలింగ్‌ లక్ష్యం

Published Wed, Nov 22 2023 4:32 AM

అవగాహన ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ - Sakshi

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో వందశాతం ఓటింగ్‌ లక్ష్యంగా ఓటర్లను చైతన్యం చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా చెప్పారు. అందులో భాగంగా మంగళవారం ‘వాక్‌ ఫర్‌ ఓటు’ అనే నినాదంతో స్థానిక రాందాస్‌ చౌరస్తా నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 2 వేల మంది యువ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని రెండు నియోజక వర్గాలలో నవంబర్‌ 30న జరిగే ఎన్నికలలో వందశాతం పోలింగ్‌ లక్ష్యంతో స్వీప్‌ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే సీ విజిల్‌ యాప్‌, 1950 ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థులు, 18 ఏళ్లు నిండిన వారంతా కచ్చితంగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం యువ ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్‌, డీఈఓ రాధాకృష్ణ, డీఐఈఓ సత్యనారాయణ, మెదక్‌ ఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌, స్వీప్‌ నోడల్‌ అధికారి, డీడబ్ల్యుఓ బ్రహ్మాజీ, జిల్లా సైన్‌న్స్‌ అధికారి రాజిరెడ్డి, నాగరాజు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు, కళాజాత బృందాలు పాల్గొన్నాయి.

పోలింగ్‌ అధికారులకు ఓటింగ్‌ ఏర్పాట్లు

నర్సాపూర్‌రూరల్‌: నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించే అధికారులు తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి స్థానిక జూనియర్‌ కళాశాలలో చేసిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓలు ఈ నెల 22, 24, 25 తేదీలలో ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. వారికోసం నర్సాపూర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నర్సాపూర్‌ నియోజక వర్గంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోను, ఇతర నియోజకవర్గం నుంచి వచ్చిన అధికారులు మెదక్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం నర్సాపూర్‌ ఆర్‌డీఓ కార్యాలయంలో బ్యాలెట్‌ పేపర్లను పరిశీలించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవ హరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో నియో జకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఆర్‌డీఓ శ్రీనివాస్‌, నోడల్‌ అధికారి శ్రీనివాస్‌, ఎన్నికల అధికారులు, సిబంది పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు తప్పనిసరిగాఓటు వేయాలి

జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా

Advertisement
Advertisement