పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు

Published Thu, Nov 23 2023 4:38 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజర్షిషా - Sakshi

మెదక్‌ కలెక్టరేట్‌: ఎన్నికల నియమావళి అమలులో భాగంగా పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. బుధవారం కలెక్టరెట్‌లో పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 30న పోలింగ్‌ ఉన్నందున జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. మైక్రో అబ్జర్వర్‌లు పోలింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంప్‌, తాగునీరు, విద్యుత్‌, టాయిలెట్స్‌ వంటి సదుపాయాల గురించి పరిశీలించాలని ఆదేశించారు. అదే విధంగా పోలింగ్‌ నిర్వహణ, ఈవీఎం, వీవీప్యాట్‌, ఏజెంట్‌ల నియామక, ఇంక్‌, ఫామ్‌ 17 నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. అనంతరం సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌, మాక్‌ పోలింగ్‌, ఇంటి నుంచి ఓటు వేయడం, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అసాంఘిక ఘటనలు చోటు లేకుండా చూడాలని కోరారు. ఎన్నికలకు ముందు ఎన్నికల అనంతరం మైక్రో అబ్జర్వర్స్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్‌ రోజు చేయాల్సిన విధుల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో రాజర్షిషా వివరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వేంకటేశ్వర్లు, తూప్రాన్‌ ఆర్డీఓ జయచంద్ర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా

Advertisement
Advertisement