ప్రలోభాలకు గురికావద్దు | Sakshi
Sakshi News home page

ప్రలోభాలకు గురికావద్దు

Published Thu, Nov 23 2023 4:38 AM

ప్రతిజ్ఞచేయిస్తున్న బ్రహ్మాజీ తదితరులు  - Sakshi

జిల్లా సంక్షేమ అధికారిణి బ్రహ్మాజీ

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): ఓటరు తన విలువైన ఓటును ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిణి బ్రహ్మాజీ పిలుపునిచ్చారు. బుధవారం ఆమె చిలప్‌చెడ్‌లో ఓటు ప్రాముఖ్యత, దాని వినియోగంపై ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటును సద్వినియోగం చేసుకుంటామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తన విలువైన ఓటును వినియోగించుకోవాలని సూచించారు. డబ్బు, బహుమతులు, మద్యం వంటి ప్రలోభాలకు గురై, ఓటును దుర్వినియోగం చేసుకోవద్దు అన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్‌ సీడీపీఓ హేమభార్గవి, ఎంపీడీఓ శశిప్రభ, ఏపీఓ ప్రేమలత, గ్రామ మహిళలు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం

గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం భుజిస్తేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని జిల్లా సంక్షేమ అధికారిణి బ్రహ్మాజీ అన్నారు. బుధవారం ఆమె స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలలో అందిస్తున్న భోజనం, పాలు, గుడ్లు, బాలామృతం తదితర వాటిని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలకు పౌష్టికాహారం తినిపించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ మండల సూపర్‌వైజర్‌ సంతోషిమాత, అంగన్‌వాడీ టీచర్‌ ప్రమీల, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement