వర్చ్యువల్‌గా బాఫ్తా అవార్డుల వేడుక!

13 Apr, 2021 12:27 IST|Sakshi

74వ బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌ (బాఫ్తా) విజేతల జాబితా విడుదలైంది. లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ఈ వేడుక వర్చ్యువల్‌గా జరిగింది. బాఫ్తా విజేతల ఎనౌన్స్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ రెండు రోజులు (ఈ నెల 10, 11 తేదీల్లో) జరిగింది. మొత్తం 25 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఇందులో 8 విభాగాలకు చెందిన అవార్డు విజేతల వివరాలను మొదటి రోజు, మిగిలిన విభాగాలకు చెందిన అవార్డు విజేతలను మరుసటి రోజు ప్రకటించారు.

ఉత్తమ చిత్రంగా ‘నొమాడ్‌ ల్యాండ్‌’ నిలిచింది. ఉత్తమ నటుడి అవార్డును సర్‌ అంథోనీ హాప్కిన్స్‌ (ఫాదర్‌), ఉత్తమ నటి అవార్డును ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్మాండ్‌ (నొమాడ్‌ ల్యాండ్‌) దక్కించుకున్నారు. బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును క్లో జావ్‌ (నొమాడ్‌ ల్యాండ్‌) దక్కించు కున్నారు. బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫిల్మ్‌గా ‘సోల్‌’, బెస్ట్‌ డాక్యుమెంటరీగా ‘మై అక్టోపస్‌ టీచర్‌’, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ‘టెనెట్‌’ నిలిచాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు